ఈమధ్యకాలంలో అవయవదానం ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతోంది. బాధితుల బంధువులు, తల్లిదండ్రుల ఔదార్యంతో అవయవాల దానం ప్రాణాలకు ఆసరాగా నిలుస్తోంది. శ్రీకాకుళంలో ఓ యాక్సిడెంట్ లో విద్యార్థి బ్రెయిన్ డెడ్ అయింది. తిరుపతిలో ఆ విద్యార్ధి గుండె ఒకరికి అవసరం అయింది. దూరం భారమయినా.. ఎయిర్ అంబులెన్స్ సాయంతో ఆ గుండె వందల కిలోమీటర్లు ప్రయాణించింది. తిరుపతికి చేరుకుంది. విశాఖ నుంచి రేణిగుంటకు ప్రత్యేక విమానంలో గుండె తరలించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ హాస్పిటల్‌లో అరుదైన గుండె మార్పిడి ఆపరేషన్ జరుగుతోంది.
Read Also: Anil Kumar Eravathri: ఈటలకు స్ట్రాంగ్ వార్నింగ్.. రేవంత్ జోలికొస్తే నాలుక కోస్తారు జాగ్రత్త
శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థి కిరణ్ చంద్ ఆదివారం బ్రెయిన్ డెడ్ అయి మరణించాడు. విషాదంలోనూ తల్లిదండ్రులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కొడుకు మరో రూపంలో బ్రతికే ఉండాలని ఆకాంక్షించి అవయవదానానికి ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో భాగంగా రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుపతి చిన్నపిల్లల హాస్పిటల్ వరకు ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు పోలీసులు.
టీటీడీ చిన్నపిల్లల హస్పిటల్ లో ఈరోజు మూడో హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ సూరత్ లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను వైజాగ్ మీదుగా తిరుపతికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది టీటీడీ. రోడ్డు మార్గంలో శ్రీకాకుళం నుంచి వైజాగ్ కి గుండె తరలించారు. వైజాగ్ నుంచి ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్స్ లో తిరుపతికి తరలించేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఇప్పటికే ఇద్దరు చిన్నారులకు గుండె మార్పిడి చికిత్సలను విజయవంతంగా నిర్వహించారు టీటీడీ చిన్నపిల్లల హాస్పిటల్ డాక్టర్లు. రేణిగుంట నుంచి గ్రీన్ ఛానెల్ ద్వారా తిరుపతి ఆస్పత్రికి ఆ గుండెని తరలించారు. పోలీసులు గ్రీన్ ఛానెల్ కోసం విశేషంగా కృషిచేశారు. ఎక్కడో ఉన్న విద్యార్ధి గుండె ఇప్పుడు తిరుపతిలో మరొకరి గుండె చప్పుడు కాబోతోంది.
తిరుపతి పద్మావతి చిన్న పిల్లల హృదయాలయానికి చేరుకుంది గుండె… ఆపరేషను ప్రారంభించారు వైద్యులు.. వైజాగ్ నుంచి రేణిగుంట, రేణిగుంట నుంచి గ్రీన్ ఛానెల్ ద్వారా ఆస్పత్రికి గుండె తరలింపు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారు.
Read Also: RCB vs RR: లక్ష్యం దిశగా రాజస్థాన్ పరుగులు.. 10 ఓవర్లలో స్కోరు ఇది!