Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటన.. షెడ్యూల్ వివరాలు..
- నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యటన..
- పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు..
- మంత్రుల రాకతో పోలీసులు అలర్ట్-బందో బస్తు ఏర్పాటు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahabubabad: నేడు మహబూబాబాద్ జిల్లాలో రెవెన్యూ, హౌసింగ్, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయితీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పాల్గొంటారు. మంత్రుల రాకతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని, ప్రయాణికులు సహకరించాలని కోరారు.
Read also: Hit and Run: గజ్వేల్‌లో హిట్ అండ్ రన్.. మృతులిద్దరు పోలీసులే..
Also Read
షెడ్యూల్ వివరాలు..
* ఉదయం 9.00 గంటలకు మరిపెడ లో అమృత్ డ్రికింగ్ వాటర్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన.
* ఉదయం 9.30 నిమిషాలకు మరిపెడ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు.
* ఉదయం 10.00 గంటలకు మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభిస్తారు.
* ఉదయం 10.30 నిముషాలకు కురవి మండలం కందికొండ గ్రామం సమీపంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
* ఉదయం 11.45 నిముషాలకు మహబూబాబాద్ యశోద గార్డెన్ లో మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొంటారు.
* మధ్యాహ్నం 12 గంటలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,సీతక్క మహబూబాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.
* మధ్యాహ్నం 12.45 నిముషాలకు బేగంపేట విమానాశ్రయంకు చేరుకుంటారు.
KCR: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం.. అసెంబ్లీ సమావేశాలపై చర్చ..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!