Renting Husbands: ఈ దేశంలో అద్దెకు భర్తలు దొరుకుతారని మీలో ఎంతమందికి తెలుసు. వాస్తవానికి ఈ దేశంలో పురుషుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. అందుకే ఇప్పుడు ఆ దేశంలో మహిళలు పెళ్లి కోసం భర్తలను అద్దెకు తీసుకుంటున్నారు. ఇంతకీ ఆ దేశం ఏమిటంటే.. యూరోపియన్ దేశమైన లాట్వియా. ఈ దేశంలో మహిళలు అద్దెకు భర్తలు తీసుకునే దుస్థితి నెలకొంది. దేశంలో పురుషుల కంటే మహిళల సంఖ్య చాలా రెట్లు ఎక్కువగా ఉంది. దీంతో చాలా మంది మహిళలు ఇంటి పనుల్లో సహాయం చేయడానికి తాత్కాలిక “భర్తలను” నియమించుకోవడం ప్రారంభించారు.
READ ALSO: Hindu Rate Of Growth: ‘‘హిందూ వృద్ధిరేటు’’పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు.. అసలేంటి ఇది..
పలు నివేదికల ప్రకారం.. ఈ దేశంలో పురుషుల కంటే 15.5% ఎక్కువ మహిళలు ఉన్నారు. పని ప్రదేశంలో, దైనందిన జీవితంలో పురుషుల కొరత స్పష్టంగా కనిపిస్తుందని అక్కడ మహిళలు చెబుతున్నారు. ఈ సందర్భంగా దేశానికి చెందిన డానియా అనే మహిళ మాట్లాడుతూ.. తన సహోద్యోగులందరూ దాదాపు మహిళలే అని చెప్పింది. వారితో పనిచేయడం తనకు ఇష్టమే అయినప్పటికీ, మెరుగైన లింగ సమతుల్యత, సామాజిక పరస్పర చర్యలను మరింత ఆసక్తికరంగా మారుస్తుందని అన్నారు. పురుషుల జనాభా తక్కువగా ఉండటం, స్వదేశాలలో పరిమిత ఎంపికల కారణంగా చాలా మంది మహిళలు భాగస్వాములను వెతుక్కుంటూ విదేశాలకు వెళ్తున్నారని ఆమె వివరించారు.
రోజువారీ ఇంటి పనులకు సహాయం చేయడానికి పురుష భాగస్వామి లేకపోవడంతో, చాలా మంది లాట్వియన్ మహిళలు అద్దెకు నియమించుకునే వైపు మొగ్గు చూపుతున్నారు. Komanda24 వంటి ప్లాట్‌ఫామ్‌లు “మెన్ విత్ గోల్డెన్ హ్యాండ్స్” సేవలను అందిస్తున్నాయి. ఇక్కడ ప్లంబింగ్, వడ్రంగి, మరమ్మతులు, టీవీ ఇన్‌స్టాలేషన్‌లో సహాయం చేయడానికి పురుషులను నియమించుకోవచ్చు. Remontdarbi.lv, అనే మరొక సంస్థ మహిళలు ఆన్‌లైన్‌లో లేదా ఫోన్ ద్వారా “ఒక గంటకు భర్త”ను బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ దేశంలో పెయింటింగ్, కర్టెన్లు ఫిక్సింగ్, ఇతర నిర్వహణ పనులను నిర్వహించడానికి సిబ్బంది త్వరగా వస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లాట్వియాలో లింగ అసమతుల్యతకు ప్రధాన కారణం పురుషుల సగటు ఆయుర్దాయం తక్కువగా ఉండటం, అలాగే అధిక ధూమపానం, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలు. వరల్డ్ అట్లాస్ ప్రకారం.. లాట్వియన్ దేశంలో పురుషులలో 31%, మహిళల్లో కేవలం 10% మంది మాత్రమే ధూమపానానికి బానిసలు, అలాగే పురుషులు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా పురుషుల ఆయుర్దాయంపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ఈ దేశంలో లింగ అసమతుల్యత 30 – 40 సంవత్సరాల మధ్య కనిపిస్తుందని సామాజిక శాస్త్రవేత్త బైబాబెల్లా వెల్లడించారు. ఈ వయస్సులో పురుషుల మరణాల రేటు మహిళల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది.
యూరోస్టాట్ డేటా ప్రకారం.. లాట్వియాలో మహిళలు పురుషుల కంటే 15.5% ఎక్కువగా ఉన్నారు. ఇది EU సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ. దేశంలో ఈ అంతరం వయస్సుతో పాటు పెరుగుతుంది. లాట్వియన్ మహిళలు పురుషుల కంటే 11 సంవత్సరాలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో దేశంలోని మహిళలు పురుషుల ఉనికి లేకుండా స్వతంత్రంగా తమ జీవితాలను నిర్వహించుకోవలసి వస్తుంది. ఈ క్రమంలో మహిళలు వారి జీవితాలలో పురుషుల శూన్యతను పూడ్చుకోవడానికి ఆధునిక సేవలైన అద్దెలపై ఆధారపడుతున్నారు. భర్తను అద్దెకు తీసుకునే ట్రెండ్ కేవలం లాట్వియాకే పరిమితం కాలేదు. 2022లో UK కి చెందిన లారా యంగ్ తన భర్త జేమ్స్‌ను “రెంట్ మై హ్యాండీ హస్బెండ్” అని వ్యాపారంలో పెట్టి ఇంటి పనుల కోసం అద్దెకు ఇవ్వడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె వ్యాపారం సక్సెస్ కావడంతో జేమ్స్ ఎల్లప్పుడూ బిజీగా ఉంటూ, ఆయన చేస్తున్న వివిధ ఇంటి పనుల కోసం గంట లేదా రోజు వారీగా ఛార్జీలు వసూలు చేస్తాడు.
READ ALSO: Karumuri Venkata Nageswara Rao: జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు.. యాదవులకు ద్రోహం చేసింది టీడీపీనే!