Lalu Yadav: దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలకు బాధ్యులెవరు..?
- పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాద ఘటన
- ప్రమాదంపై ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ ప్రశ్నలు
- దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలకు బాధ్యులెవరు..?- లాలూ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పైగురిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 8 మంది మరణించారు. అంతేకాకుండా.. 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. కాగా.. ఈ రైలు ప్రమాద ఘటనపై ఆర్జేడీ అధినేత, మాజీ రైల్వే మంత్రి లాలూ యాదవ్ ప్రశ్నలు సంధించారు. దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. గత ఏడాది కాలంలో 7 పెద్ద రైల్వే ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ యాదవ్ ‘X’ లో పోస్ట్ చేశారు. దేశంలో తరచుగా జరుగుతున్న రైల్వే ప్రమాదాలకు బాధ్యులు ఎవరు అని ఆయన ప్రశ్నించారు.
देश में लगातार हो रहे रेल हादसों का जिम्मेवार कौन है?
Also Read
— Lalu Prasad Yadav (@laluprasadrjd) June 17, 2024
Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. మృతి చెందిన వారిలో లోకో పైలట్, సహాయకుడు
ఈరోజు కతిహార్ డివిజన్లోని రంగపాణి-నిజబరీ స్టేషన్ల మధ్య స్టేషన్లో నిలిచి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుండి గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ క్రమంలో.. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. గట్టిగా ఢీకొట్టడంతో ఒక బోగీ మరో బోగీపైకి ఎక్కింది. ఇందులో 8 మందికి పైగా మృతి చెందినట్లు నిర్ధారించారు. 50 మందికి పైగా గాయపడ్డారని.. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు రైల్వే మంత్రి ఒక్కొక్కరికి రూ.10 లక్షల సాయం ప్రకటించారు.
Bengal rail accident: మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా..
కాగా.. గత ఏడాది కాలంలో దేశంలో 7కు పైగా పెద్ద రైల్వే ప్రమాదాలు జరిగాయి. 2023 జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 296 మంది చనిపోయారు. 2023 అక్టోబర్ 29న ఆంధ్రాలోని విజయనగరం కంటపల్లి వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్తారాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. గత ఏడాది అక్టోబర్‌లో బక్సర్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదానికి గురైంది. రైలులోని 24 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా గాయపడినట్లు నిర్ధారించారు. నలుగురు మరణించారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!