హైదరాబాద్ లో లాల్ దర్వాజ బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. లాల్ దర్వాజ భక్తజన సంద్రంగా మారింది. సింహవాహిని మహంకాళి ఆలయం, అక్కన్న మాదన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చార్మినార్ వద్దకు అంబారిపై వచ్చిన శ్రీ అక్కన మాదన్న మహంకాళి అమ్మవారి ఘటం ఊరేగింపు కు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అంబారి పై శ్రీ అక్కన మాదన్న మహంకాళి అమ్మవారి ఘటం ఊరేగింపు చార్మినార్ మీదుగు ముందుకు కొనసాగింది. ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీ ప్రసిద్ధిగాంచిన శ్రీ అక్కన మాదన్న అమ్మవారి ఘటం ఉరిగింపు అంబారి పై హరి బౌలి నుండి ప్రారంభం అయ్యింది.
Also Read : Harish Rao : మారథాన్ రన్‌లో అందరూ పాల్గొనాలి
హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ జెండా ఊపి అమ్మవారి ఘటం ఊరేగింపును ప్రారంభించారు. హైదరాబాద్ పాతబస్తీ వివిధ ప్రాంతాల నుండి అమ్మవారి ఘటాలు ఉరేగింపులో భారీ భాజ బజంత్రీ, కళాకారుల బృందాల నడుమ అమ్మవారి ఘటాలు ముందుకు సాగాయి. హైదరాబాద్ పాతబస్తీ హరి బౌలి లోని శ్రీ అక్కన మాదన్న మహంకాళి అమ్మవారి అలయంవద్ద నుండి బయలుదేరిన అమ్మవారి ఘటం హరి బౌలి,లాల్ దర్వాజ x రోడ్ ,షా అలీ బండ, చార్మినార్ మీదుగా గుల్జార్ హౌజ్,నాయపుల్ ఢిల్లీ దర్వాజ వరకు సాగింది.
Also Read : Gangula Kamalakar : మిడ్ మానేర్ నీటిని విడుదల చేసిన మంత్రి గంగుల
ఈ సందర్భంగా.. అనురాధ… భవిష్యవాణి వినిపించారు. ‘నాకు సంతోషంగా ఉంది.. నాకు కావాల్సిన పూజలన్ని అందిస్తున్నారు… కాలం వచ్చినప్పుడే వర్షం కురుస్తుంది… మీరు చేసిన పాపాల వల్లే వర్షాలు సరిగ్గా పడటం లేదు… నేనే మూలా విరాట్… నాకోసం ఆలయం కోరాను… ఆ కోరికను తీర్చాల్సిన బాధ్యత మీదే.. అందరూ కలిసి అడుగులు వేయండి పని జరుగుతుంది.. ఎవరికి ఏ బాధ వచ్చినా నా దగ్గరికి వచ్చి కోరుకుంటే నేను తీరుస్తాను… 5 వారాలు సాకలు పెట్టండి… పూజలు చెయ్యండి శాంతి చేయండి.
అందరినీ కాపాడుకునే శక్తి నాది… ఎవ్వరికీ ఏ బాధ వచ్చినా నేను తీరుస్తాను… నలుగురు కి మంచి చేసే పనిలో మిమ్మల్ని ముందుండి… నడిపిస్తాను. మీరు చేసిన పాపాల వల్ల ఒకచోట కుంభ వృష్టి… మరొక చోట వర్షం లేదు… నాకు జరిగే పూజలు నాకు కావలసినట్టుగా చేయించుకుంటాను’ అని భవిష్యవాణి వినిపించారు.
https://www.youtube.com/live/FGK29xIe6X0?feature=share