’20th సెంచరీ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై కె. హిమ బిందు నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ లగ్గం టైమ్ చిత్రం షూటింగ్ పూర్తయింది. రాజేష్ మేరు, నవ్య చిత్యాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహిస్తున్నారు. నెల్లూరు సుధర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనుండగా, పవన్ గుంటుకు సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
పవన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టాయి. ముఖ్యంగా “ఏమైందో గాని” అనే పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచి, సినిమాపై అంచనాలను పెంచింది. ఈ పాటలు యూత్‌ను ఆకర్షించడమే కాకుండా, సినిమా టోన్‌కు తగ్గట్టుగా ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించాయి. తాజాగా షెడ్యూల్‌తో లగ్గం టైమ్ షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కేవలం యూత్‌ను మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా రూపొందిందని నిర్మాతలు తెలిపారు. టైటిల్‌కు తగ్గట్టుగా ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని, సినిమా అద్భుతంగా తెరకెక్కిందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే లగ్గం టైమ్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. అంతేకాదు, సమ్మర్ సీజన్‌లో ప్రేక్షకులకు కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీని కూడా టీమ్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.