Kusal Perera: కొత్త సంవత్సరం 2025లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే కుశాల్ పెరీరా ధాటిగా ఆడి రికార్డ్ సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో తన తుఫాన్ సెంచరీతో జట్టుకు సంవత్సరంలో మొదటి రోజు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ సెంచరీ కుశాల్ పెరీరాకు అంతర్జాతీయ టీ20లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచింది. కేవలం 44 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేసి, 219.56 స్ట్రైక్ రేట్‌తో.. 13 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 101 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. ఇక, ఈ సెంచరీ ఆయన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో అతని తొలి సెంచరీ.
Also Read: Gold Rate Today: కొత్త ఏడాదిలో వరుస షాక్‌లు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
కుశాల్ పెరీరా 14 ఏళ్ల తరువాత శ్రీలంక క్రికెట్ రికార్డును తిరగరాసారు. 44 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా ఆయన, 2011లో తిలకరత్నే దిల్షాన్ చేసిన 55 బంతుల్లో సెంచరీ రికార్డును బద్దలు కొట్టారు. 2025 సంవత్సరంలో జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో కుశాల్ పెరీరా సెంచరీ సాధించి, ఈ ఏడాది అంతర్జాతీయ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష చేదనలో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులకే పరిమితం కావడంతో శ్రీలంక ఏడు పరుగులతో విజయం సాధించింది. సెంచరీతో రికార్డు సృష్టించిన కుశల్ పెరీరాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే, మూడు టి20 సీరిస్ లో భాగంగా మొదటి రెండు మ్యాచ్లు న్యూజిలాండ్ గెలిచింది. దీంతో సిరీస్ 2-1తో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది సీరిస్ గా న్యూజిలాండ్ ఆటగాడు జాకబ్ నిలిచాడు.