Relationship: ఫేస్‌బుక్ పరిచయం అక్రమ సంబంధంగా మారింది. ఆ తర్వాత ప్రాణాలను తీసింది. కర్ణాటక హసన్‌లో ఒక మహిళను ఫేస్‌బుక్‌లో పరిచమైన వ్యక్తి హత్య చేశాడు. 28 ఏళ్ల వివాహిత తనతో శృంగార సంబంధాన్ని కొనసాగించాలని ఒత్తిడి తీసుకురావడంతో, ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీని తర్వాత నిందితుడు మహిళను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని మాండ్యాలోని తన వ్యవసాయ భూమిలో పాతిపెట్టాడు.
నిందితుడు పునీత్, 28 ఏళ్ల ప్రీతి అనే వివాహితతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరు తరుచుగా ఆన్‌లైన్‌లో మాట్లాడుకోవడంతో పాటు, ఫోన్ కాల్స్ చేసుకునే వారు. ఆదివారం నాడు ఇద్దరూ మొదటిసారిగా వ్యక్తిగతంగా కలుసుకున్నారు. పునీత్ ప్రీతిని హసన్ నుంచి మైసూరుకు రెంట్ తీసుకున్న కారులో తీసుకెళ్లాడు. కొన్ని ప్రదేశాలు తిరిగిన తర్వాత, వీరిద్దరు కృష్ణ రాజ సాగర్ సమీపంలోని ఒక లాడ్జ్‌లో దిగారు. ఆ తర్వాత ఇద్దరు లైంగిక సంబంధాన్ని పెట్టుకున్నారు.
Read Also: Viral Video: ఎద్దు ముందు మోకరిల్లిన రెండు క్రూరమైన జాగ్వార్‌లు.. షాకింగ్ వీడియో
అయితే దీని తర్వాత, ప్రీతి తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని పునీత్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది. ఆమె పదేపదే శృంగార సంబంధం కొనసాగించాలని పట్టుబట్టడంతో కట్టెరఘట్టలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడే వీరిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగిందని, ఆ సమయంలో ప్రీతి తలపై పునీత్ కొట్టాడని పోలీసులు చెప్పారు. రాయితో తలపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత మృతదేహాన్ని నిందితుడు తన సొంత గ్రామం కరోతిగ్రామ్‌కు తరలించి, తన వ్యవసాయ భూమిలో పాతిపెట్టాడు.
జూన్ 23న హసన్‌లో ప్రీతి భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్లు మాండ్య పోలీసు సూపరింటెండెంట్ మల్లికార్జున్ బాలదండి చెప్పారు. పోలీసులు ఆమె నెంబర్‌కి ఫోన్ చేయగా పునీత్ సమాధానం ఇచ్చాడని తేలింది. ప్రీతి తన కారు అద్దెకు తీసుకుని బస్సు ఎక్కి, ఫోన్ మరిచిపోయిందని చెప్పాడు. అయితే, సమీపంలో దొరికిన మహిళ మృతదేహం గురించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అది ప్రీతి డెడ్‌బాగీ భర్త గుర్తించాడు. దీంతో పునీత్ హత్య చేసినట్లు తేలింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా రోజులుగా పునీత్, ప్రతీ ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపినప్పటికీ, వారిద్దరు వ్యక్తిగతం తొలిసారి కలుసుకున్నారని పోలీసులు నిర్ధారించారు.