Pandu Mirapakaya Pachadi: ఏడాది దాటినా అదే ఘాటు, అదే రుచి! పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఇలా పెట్టేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pandu Mirapakaya Pachadi:తెలుగువారి వంటకాల్లో ఎన్ని రకాల వెరైటీలు ఉన్నా.. వేడివేడి అన్నంలోకి ఒక్క చెంచా పండు మిరపకాయ తొక్కు పచ్చడి, కాస్త నెయ్యి పడితే వచ్చే ఆ తృప్తే వేరు. చలికాలం, ఎండాకాలం ప్రారంభంలో మార్కెట్లోకి ఎర్రటి పండు మిరపకాయలు రాగానే ఇళ్లలో పచ్చళ్ల సందడి మొదలవుతుంది. అయితే చాలామంది చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పచ్చడి త్వరగా నల్లబడిపోవడం, బూజు పట్టడం జరుగుతుంటుంది. అలా కాకుండా ఏళ్ల తరబడి తాజాగా, అదే ఎరుపు రంగుతో, ఘాటుగా ఉండాలంటే కొన్ని సీక్రెట్ కొలతలు, మెళకువలు పాటించాల్సిందే. ఆ సీక్రెట్ కొలతలు, మెళకువలు ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
పచ్చడి పాడవకుండా ఉండే గోల్డెన్ రూల్
నిల్వ పచ్చడి ఎక్కువ కాలం మన్నాలంటే అత్యంత కీలకమైన అంశం ‘తేమ’ ఏమాత్రం ఉండకపోవడం. పండు మిరపకాయలను తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగి, పొడి కాటన్ గుడ్డతో ప్రతి కాయనూ ఒత్తుతూ తుడవాలి. ఫ్యాన్ గాలి కింద కాసేపు ఆరబెట్టిన తర్వాత మాత్రమే తొడిమెలు తీయాలి. తొడిమెలు తీశాక కడిగితే కాయ లోపలికి నీరు చేరి పచ్చడి బూజు పట్టే ప్రమాదం ఉంది. పూర్తిగా ఆరిన తర్వాతే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
Also Read
- Clothes Washing Tips: బట్టలు ఉతకడానికి ముందు ఎంతసేపు నానబెట్టాలి? ఈ తప్పు చేస్తే మీ బట్టలు పాడైపోవడం ఖాయం!
- National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
- Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
- Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
పక్కా కొలతలు ఇవే:
* పండు మిరపకాయలు: 500 గ్రాములు
* చింతపండు: 125 గ్రాములు (కేజీ మిర్చికి 250 గ్రాములు పక్కా నిష్పత్తి)
* ఉప్పు: 125 గ్రాములు
* వెల్లుల్లి: పావు కప్పు (తొక్క వొలిచినవి)
* పసుపు: 1 టీస్పూన్
* తాలింపు కోసం: పప్పుల నూనె లేదా వేరుశనగ నూనె (150 మి.లీ), ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, దంచిన వెల్లుల్లి.
* స్పెషల్ పౌడర్: వేయించి పొడి చేసిన మెంతుల పొడి (1 స్పూన్), ఆవాల పొడి (1 స్పూన్).
చింతపండు ముద్ద కాకుండా ఉండే సీక్రెట్ ట్రిక్:
చాలామంది చింతపండును నేరుగా మిరపకాయలతో కలిపి రుబ్బుతారు. దీనివల్ల పచ్చడిలో చింతపండు అక్కడక్కడా ఉండలుగా ఉండిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే.. గింజలు, ఈనెలు తీసేసిన చింతపండును, ఉప్పుతో కలిపి మిక్సీ జార్లో ముందుగా మెత్తని పొడిలా తిప్పుకోవాలి. ఆ తర్వాతే పండు మిర్చి ముక్కలను వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. చివరిలో పసుపు, పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసి జస్ట్ ఒక్క పల్స్ ఇస్తే సరిపోతుంది. రుబ్బిన పచ్చడిని ఒక పింగాణీ లేదా గాజు పాత్రలోకి తీసుకుని 24 గంటల పాటు కదపకుండా ఊరనివ్వాలి. మరుసటి రోజు కావాల్సినంత పచ్చడికి మాత్రమే తాలింపు పెట్టుకోవచ్చు. పచ్చళ్లకు సన్‌ఫ్లవర్ ఆయిల్ అస్సలు వాడకూడదు. స్వచ్ఛమైన వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె వాడితేనే అసలైన రుచి వస్తుంది. బాణలిలో నూనె వేడిచేసి వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ దోరగా వేయించాలి. ఆ తర్వాత ఊరిన పచ్చడి ముద్దను వేసి కలుపుతూ, చివరిగా వేయించిన మెంతి పొడి, ఆవాల పొడి చల్లి నూనె పైకి తేలేవరకు చిన్న మంటపై రెండు నిమిషాలు మగ్గించాలి. మొత్తం పచ్చడికి ఒకేసారి తాలింపు పెట్టకుండా.. ఊరబెట్టిన మిశ్రమాన్ని జాడీలో వేసి, మూతపై శుభ్రమైన క్లాత్ కట్టి చల్లని ప్రదేశంలో ఉంచితే రెండేళ్లయినా రంగు మారదు, పాడవదు. నెలకోసారి అవసరమైన పరిమాణంలో తీసుకుని ఫ్రెష్‌గా తాలింపు పెట్టుకుంటే.. అప్పుడే రుబ్బిన సరికొత్త రుచితో వేడి అన్నంలోకి, టిఫిన్లలోకి జిహ్వకు అద్భుతమైన విందులా ఉంటుంది.
పండు మిరపకాయ నిల్వ పచ్చడి రుచిలోనే కాదు, అందులో ఉపయోగించే దినుసుల వల్ల శరీరానికి పలు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
* విటమిన్-సి సమృద్ధిగా లభిస్తుంది: పండు మిరపకాయల్లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పెంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.
* మెటబాలిజం పెరుగుదల: పండు మిర్చిలోని ‘క్యాప్సైసిన్’ అనే సహజ సమ్మేళనం శరీరంలో జీవక్రియలను వేగవంతం చేస్తుంది. ఇది కేలరీలను కరిగించడంలో సహాయపడి బరువు నియంత్రణకు మేలు చేస్తుంది.
* జీర్ణక్రియ మెరుగుపడుతుంది: పచ్చడిలో వాడే ఆవాలు, మెంతులు, వెల్లుల్లి జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి.
* యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు: మెంతులు, వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు శరీరంలో అంతర్గత వాపులను, నొప్పులను తగ్గించడానికి ఉపకరిస్తాయి. వెల్లుల్లి రక్తపోటును నియంత్రించడంలోనూ సహాయపడుతుంది.
* రక్త ప్రసరణ మెరుగుపడుతుంది: క్యాప్సైసిన్ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి, రక్త ప్రసరణ సాఫీగా సాగేందుకు దోహదపడుతుంది.
గమనిక: ఇందులో ఉప్పు, నూనె, కారం పరిమాణం ఎక్కువగా ఉంటాయి కాబట్టి అధిక రక్తపోటు (బీపీ), అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు మితంగా తీసుకోవడం శ్రేయస్కరం.
తాజావార్తలు
-
US Midterm Elections Results: అధ్యక్షుడిపై తీవ్ర ఆగ్రహం.. 70 శాతం మంది యూత్‌కి ట్రంప్ నచ్చలే..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Trump’s Midterm Setback: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో.. ట్రంప్ పార్టీ ఓడితే భారత్‌కు లాభమా? నష్టమా?
-
Google Maps: అసలు.. గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ జామ్ ఎలా తెలుస్తుంది? దీని వెనుక అసలు టెక్నాలజీ ఇదే!
-
King 100 Glimpse: ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే నేను..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి