సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మూడో సారి కలిసి చేస్తున్న సినిమా గుంటూరు కారం. జనవరి 12న రీజనల్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ గుంటూరు కారం రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచే హైప్ మైంటైన్ చేస్తున్న ఈ మూవీ నుంచి బయటకి వచ్చే ప్రమోషనల్ కంటెంట్ ఘట్టమనేని అభిమానుల్లో జోష్ పెంచుతోంది. మాస్ స్ట్రైక్ వీడియో, పోస్టర్స్, ధమ్ మసాలా సాంగ్ గుంటూరు కారం సినిమాపై అభిమానుల అంచనాలని మరింత పెంచాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఓ మై బేబీ సాంగ్ మాత్రమే డివైడ్ కామెంట్స్ ని ఫేస్ చేసింది. శ్రీలీల-మహేష్ బాబుపై కంపోజ్ చేసిన ఓ మై బేబీ సాంగ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ పై మహేష్ ఫ్యాన్స్ నుంచే నెగటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ కి ప్రొడ్యూసర్స్ నాగ వంశీ, లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రిలు సీరియస్ అయ్యారు అంటే అభిమానులు ఏ రేంజులో నెగటివ్ ట్రెండ్ చేసారో అర్ధం చేసుకోవచ్చు.
నాగ వంశీ… మంచి సినిమానే చేస్తున్నాం జనవరి 12న మహేష్ బాబుని ముందెన్నడూ చూడని విధంగా చూడబోతున్నాం అంటూ అభిమానులని కూల్ చేసే ప్రయత్నం చేసాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. దీంతో వీలైనంత త్వరగా గుంటూరు కారం సినిమా నుంచి మూడో సాంగ్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. క్రిస్మస్ కానుకగా కానీ న్యూ ఇయర్ కి కానీ మూడో సాంగ్ ని రిలీజ్ చేసి నెగటివ్ కామెంట్స్ ని కాస్త సెటిల్ చెయ్యాలని చూస్తున్నారని సమాచారం. ఈ మూడో మాస్ సాంగ్ ని తెలుస్తోంది. అయితే ఇవి ఊహాగానాలు మాత్రమే… మూడో సాంగ్ రిలీజ్ విషయంలో మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.