Prajwal Revanna: వీడియోల లీక్‌పై కుమారస్వామి తీవ్ర ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన అభ్యంతరకర వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయాలనే కాకుండా.. యావత్తు దేశాన్ని కుదిపేసింది. పెన్‌డ్రైవ్‌లో వందలాది వీడియోలు భయటపడ్డాయి. మరోవైపు ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. అయితే ఈ వీడియోల లీక్ వెనుక భారీ కుట్ర జరిగిందని కర్ణాటక ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు.
ఇది కూడా చదవండి: PM Modi: “ఇండీ కూటమి మరింత ఆవిరైపోతోంది”.. మూడో దశ తర్వాత పీఎం ట్వీట్..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఎన్నికల ముందు అభ్యంతరకర వీడియోలున్న 25 వేల పెన్‌డ్రైవ్‌లను పంచారని కుమారస్వామి విమర్శించారు. ఈ కుట్ర వెనక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమాజంలో జరగకూడని ఒక అంశం గురించి మాట్లాడేందుకు తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు. మొదట బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పెన్‌డ్రైవ్‌ను విడుదల చేశారని.. ఇది ఏప్రిల్ 21న జరిగిందని తెలిపారు. ఆ రోజు రాత్రి ఒక వాట్సాప్ ఛానల్‌ను క్రియేట్ చేశారని.. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు వీక్షించేందుకు ఈ ఛానల్‌ను ఫాలో అవ్వండని అందులో మెసేజ్ పెట్టారన్నారు.
ఇది కూడా చదవండి: DC vs RR: హాఫ్ సెంచరీలతో మెరిసిన మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్.. ఆర్ఆర్ టార్గెట్ 222..
వీడియోల్లో ఉన్న దేనినీ తాను సమర్థించడం లేదని కుమారస్వామి చెప్పారు. చట్టపరంగా తప్పు చేసినవారికి శిక్ష పడాలన్నారు. అలాగే ఆ వీడియోలను పంచిన విషయంలో నలుగురు వ్యక్తులపై కేసు నమోదైందని చెప్పారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. సిట్‌ను ఏర్పాటు చేసినప్పుడు న్యాయం జరుగుతుందని తాను భావించానని.. కానీ ఇప్పుడు అలా అనిపించడం లేదన్నారు. అధికారంలో ఉన్నవారు సిట్ సభ్యుల్ని వారి ఇంటికి పిలిచి, కేసు గురించి మాట్లాడుతున్నారని కుమారస్వామి ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ముగ్గురు జేడీఎస్ అభ్యర్థులు ఓడిపోతారని సిద్ధరామయ్య ధీమాగా చెప్పారని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. అలాగే పోలీసు అధికారుల సహాయంతో ఆ పెన్‌డ్రైవ్‌ల పంపిణీ జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇది కూడా చదవండి: Kothapalli Geetha: వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కొత్తపల్లి గీత..
ఇదిలా ఉంటే ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇప్పటికే ఆయనకు సిట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇక లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. ప్రస్తుతం ప్రజ్వల్.. హాసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. కానీ ఆయన ప్రచారం చేయకుండా.. పరారీలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!