బాలివుడ్ రొమాంటిక్ హీరో అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు హృతిక్ రోషన్.. ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. వరుస సినిమాలతో బిజీగా ఉండే హృతిక్ అప్పుడప్పుడు అభిమానులను పలకరిస్తూ ఉంటాడు.. కొన్ని సందర్భాల్లో కలుస్తూ ఉంటాడు.. తాజాగా మెట్రోలో దర్శనమిచ్చారు.. ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ ను స్కిప్ చేయడానికి మెట్రోలో ప్రయాణిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు మెట్రోలో ప్రయాణించి వార్తల్లో నిలిచారు.. హృతిక్ రోషన్ తన కారును వదిలి ముంబైలో ఢిల్లీ మెట్రో ఎక్కారు అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
మాములుగా ఈ హీరో ఎప్పుడూ లగ్జరీ కార్లలోనే ట్రావెల్ చేస్తుంటాడు. అయితే తాజాగా ఆయన మెట్రో లో ప్రయాణించారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హృతిక్ ‘ఫైటర్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఎక్కువ ఉండటంతో ఇలా మెట్రో ఎక్కాడు.. హృతిక్ ను ఒక్కసారిగా చూసిన ఫ్యాన్స్ సంతోషంలో మునిగితేలారు.. ఇక ఆటోగ్రాఫ్ లో ఫోటోలు అంటూ ఫ్యాన్స్ ఎగబడ్డారు..
మెట్రోలో ప్రయాణికులు తక్కువ ఉండటంతో హృతిక్ ఓపికగా తన అభిమానులతో సెల్ఫీలు దిగాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు హృతిక్.. గతంలో ఎంతో మంది సెలెబ్రేటీలు ఇలా మెట్రోలో ప్రయాణం చేశారు.. ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వాటిల్లో చాలా స్మార్ట్ గా అందంగా కనిపిస్తున్నారు..