మొబైల్ లవర్స్ కు మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ భారత్ మార్కెట్ లో తన బడ్జెట్-సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G+ ను విడుదల చేసింది. ఇందులో మీడియం రేంజ్ ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ D7300 అల్టిమేట్, 5500mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది. సేల్ ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.
Also Read:Ishan Kishan: ఏంటి బ్రో.. పాకిస్థాన్ కెప్టెన్‌ను అంత మాట అన్నావ్!
ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G+ ధర
భారత్ లో Infinix Note 50x 5G+ ధర 6GB+128GB వేరియంట్‌కు రూ.11,499గా కంపెనీ నిర్ణయించింది. 8GB + 128GB వేరియంట్ ధర రూ.12,999 గా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ సీ బ్రీజ్ గ్రీన్, పర్పుల్, టైటానియం అనే మూడు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. పర్పుల్, గ్రే వేరియంట్లలో మెటాలిక్ బ్యాక్ ఉంటుంది. అయితే మూడవ బ్రీజ్ గ్రీన్ వేరియంట్ వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తుంది.
Also Read:MP Avinash Reddy: ఇంత తక్కువ టైంలోనే టీడీపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది!
ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G+ స్పెసిఫికేషన్లు
ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G+, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అమర్చారు. ఈ ప్రాసెసర్ గేమింగ్ కోసం 90FPS కి సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ ఉపయోగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇది అని కంపెని తెలిపింది. ఇది Android 15-ఆధారిత XOS 15 పై పనిచేస్తుంది. Infinix Note 50x 5G+ మిలిటరీ-గ్రేడ్ మన్నికతో IP64 రేటింగ్ తో వస్తుంది.
Also Read:Vladimir Putin: భారత పర్యటనకు రాబోతున్న పుతిన్..
ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G+ లో జెమ్-కట్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో యాక్టివ్ హాలో లైట్నింగ్, ఫోలాక్స్-AI అసిస్టెంట్ ఉన్నాయి. ఇది డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా సెన్సార్, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5500mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. యాంటీ-థెఫ్ట్ ఫీచర్ ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G+ లో AI ఆబ్జెక్ట్ ఎరేజర్, AI ఇమేజ్ కటౌట్, AIGC పోర్ట్రెయిట్ మోడ్, AI నోట్, ఫోలాక్స్ AI వాయిస్ అసిస్టెంట్ వంటి అనేక AI ఫీచర్లు ఉన్నాయి.