KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు కారు కేసులో ఆయనను జూన్ 16వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని కోరారు. ఇదే కేసులో ఇది కేటీఆర్‌కు రెండోసారి నోటీసులు కావడం గమనార్హం. ACB ఇప్పటికే మే 26వ తేదీన హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ, కేటీఆర్ అప్పటికే విదేశీ పర్యటనలో ఉండటంతో విచారణకు హాజరు కాలేకపోయారు. తాజాగా విదేశీ పర్యటన ముగిసిన నేపథ్యంలో మరోసారి నోటీసులు పంపించడంతో బీఆర్ఎస్ వర్గాల్లో ఉద్విగ్నత నెలకొంది. రేపటి విచారణలో ఏం జరుగుతుందన్నది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
WTC 2025-27: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ షెడ్యూల్ విడుదల.. భారత్ ఎన్ని మ్యాచులు ఆడనుందంటే..?
ఫార్ములా ఈ రేసును తలపెట్టిన తీరుపై గత ఎనిమిది నెలలుగా ACB విచారణ జరుపుతోంది. ఈ సమయంలో అనేక అధికారులను ప్రశ్నించగా, కేసులో విదేశాలకు ₹55 కోట్లు మళ్లించడంపై ముఖ్యమైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. మంత్రివర్గ ఆమోదం లేకుండా హెచ్ఎండీఏ నిధుల మళ్లింపు అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రస్తుత ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి తదితరులను ACB విచారించింది. గతేడాది డిసెంబరు 19న ఫార్ములా ఈ రేసుకు సంబంధించి అధికారికంగా కేసు నమోదు చేసిన ACB అధికారులు, దర్యాప్తు లో భాగంగా కేటీఆర్‌ను కూడా ఒకసారి ప్రశ్నించారు. ఇప్పుడు మరోసారి విచారణకు పిలవడం కేసు వేగం పుంజుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
YS Jagan: నా ప్రతి అడుగులో నువ్వే నా స్ఫూర్తి.. మాజీ సీఎం ఎమోషనల్ పోస్ట్..!
