NTV Telugu Site icon

KTR : ఘటనతో సంబంధం లేని వారిని కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేశారు

Ktr

Ktr

KTR : సంగారెడ్డి సెంట్రల్ జైలులో కేటీఆర్ ములాఖత్ ముగిసింది. సుమారు 40 నిమిషాలు 16 మందితో ములాఖత్ సాగింది. ములాఖత్‌ అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. లగచర్ల, హాకింపేట రైతులు గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారని, రాబందుల్లా రేవంత్ రెడ్డి పేదల భూములు గుంజుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. తొమ్మిది నెలలు ఎవరు పట్టించుకోకుంటే అధికారులు వస్తే నిరసన తెలిపితే తప్పా అని, ఘటనతో సంబంధం లేని వారిని కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. దుగ్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ అనుచరులే ఈ దాడి చేశారని చెబుతున్నారని, సీఎం రేవంత్ అన్నే ఈ దాడి డైరెక్షన్ ఇస్తున్నారని రైతులు చెప్పారన్నారు. దాడి జరిగాక బీఆర్‌ఎస్‌ నాయకుల్ని అరెస్ట్ చేసి కాంగ్రెస్ వాళ్ళని వదిలేశారని ఆయన ఆరోపించారు. థర్డ్ డిగ్రీలు పెట్టి చిత్రహింసలు ఔట్టారని, మేజిస్ట్రేట్ ముందు ఈ విషయం చెబితే ఇంటి వాళ్ళని కొడుతామని బెదిరించారని రైతులు చెబుతున్నారన్నారు.

Anil Ambani: అనిల్‌ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ! ఎస్‌ఈసీఐ షోకాజ్ నోటీసు

కొడంగల్ ఎస్సై, సీఐ వందల మంది పోలీసులు, ప్రయివేటు వ్యక్తులు బూతులు మాట్లాడుతూ దాడి చేసినట్లు తెలిపారన్నారు. సీఎం రేవంత్ పదవి ఐదేళ్లే అని, మీ ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే రేపో మాపో పదవి పోతుందన్నారు. మేం అధికారంలో వచ్చాక నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు అని, జైల్లో వేసిన కుటుంబాల ఉసురు తాకుతుందన్నారు కేటీఆర్‌. బాధితులకు అండగా బీఆర్‌ఎస్‌ ఉంటుందని, తిరుపతి రెడ్డి బెదిరింపులకు ఎవరు భయపడేవాడు లేడని ఆయన అన్నారు. అవసరం అయితే సుప్రీం కోర్టుకి వెళతామన్నారు కేటీఆర్‌. సంగారెడ్డి జిల్లా న్యాలకల్ లోను అలాగే గొడవ జరుగుతుందని, హైదరాబాద్ శివార్లలో ఫార్మాసిటీ కేసీఆర్ పెడితే రేవంత్ వాళ్ల కుటుంబ సభ్యుల కోసం మార్చారన్నారు. కేసీఆర్ మీకు అండగా ఉంటారని, రాష్ట్రవ్యాప్తంగా ఫార్మా సిటీ పేరుతో జరుగుతున్న ఆందోళనలకు మా పార్టీ అండగా ఉంటుందన్నారు కేటీఆర్‌.

Anil Ambani: అనిల్‌ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ! ఎస్‌ఈసీఐ షోకాజ్ నోటీసు