IND A vs PAK A: నేడు ఆసియా కప్‌లో దాయాదుల సమరం..! పాకిస్థాన్‌తో భారత్ కీలక పోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND A vs PAK A: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా నేడు (నవంబర్ 22) దోహా వేదికగా భారత్ A, పాకిస్థాన్ A జట్లు తలపడనున్నాయి. గ్రూప్-బిలో భాగంగా జరిగే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. దాయాదుల దేశాల మధ్య మ్యాచ్ కావడంతో ఈ పోరు మరింత ఉత్కంఠగా సాగనుంది.
ఈ టోర్నీలో భారత్ ఏ జట్టు ఇప్పటికే అదిరిపోయే ప్రదర్శనతో సత్తా చాటింది. నేపాల్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఏకంగా 306 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఏ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కుమార్ కుశాగ్ర, తిలక్ వర్మ సెంచరీలతో చెలరేగారు. కుశాగ్ర 117 పరుగులు చేయగా, తిలక్ వర్మ 107 పరుగులతో ఆకట్టుకున్నాడు. చివర్లో సిద్ధార్థ్ షెడ్గే 14 బంతుల్లోనే అజేయంగా 36 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read
- Rishabh Pant Record: సిక్సర్‌తో సెంచరీ.. టాప్‌లో సచిన్.. రిషభ్ పంత్ స్థానం ఇదే!
- India vs Pakistan: బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ ఫైనల్లో రచ్చ.. పాక్ ఆటగాళ్లతో కలిసి అంపైర్ 'జెట్ క్రాష్' సంబరాలు
- Rishabh Pant: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. SENA దేశాల్లో తొలి వికెట్ కీపర్‌గా అరుదైన ఘనత.. మరో రికార్డు కూడా బ్రేక్..!
- Team India: టెస్టు క్రికెట్లో 700కు పైగా స్కోర్లు.. భారత్ అన్నిసార్లు చేసిందా?.. టాప్ ప్లేస్ మాత్రం..!
333 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది. కేవలం 26 పరుగులకే ఆలౌట్ అయింది. భారత యువ పేసర్లు హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో నేపాల్ బ్యాటర్లను వణికించారు. ప్రిన్స్ యాదవ్ 5 వికెట్లు పడగొట్టగా, హర్షిత్ రాణా 4 వికెట్లు తీశాడు. షాబాజ్ అహ్మద్‌కు ఒక వికెట్ దక్కింది. దీంతో భారత్ ఏ 306 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.
మరోవైపు పాకిస్థాన్ A జట్టు కూడా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో శుభారంభం చేసింది. నవంబర్ 20న యూఏఈతో జరిగిన గ్రూప్-B మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఏ 46.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో షమిల్ హుస్సేన్ 39 బంతుల్లో 62 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా, మాజ్ సాదాఖత్ 53 పరుగులు చేశాడు. అనంతరం 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 40.5 ఓవర్లలో 184 పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ బౌలర్లలో అలీ రజా, సుఫ్యాన్ ముకీమ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. దీంతో భారత్ A, పాకిస్థాన్ A జట్లు విజయాలతో నేటి పోరుకు సిద్ధమయ్యాయి.
తాజావార్తలు
-
IND A vs PAK A: నేడు ఆసియా కప్‌లో దాయాదుల సమరం..! పాకిస్థాన్‌తో భారత్ కీలక పోరు..
-
Rishabh Pant Record: సిక్సర్‌తో సెంచరీ.. టాప్‌లో సచిన్.. రిషభ్ పంత్ స్థానం ఇదే!
-
BJP MP Ramrao Wadkute: 8 నెలల క్రితమే రాజ్యసభకు ఎంపిక.. బీజేపీ ఎంపీ గుండెపోటుతో మృతి
-
India vs Pakistan: బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ ఫైనల్లో రచ్చ.. పాక్ ఆటగాళ్లతో కలిసి అంపైర్ ‘జెట్ క్రాష్’ సంబరాలు
-
Rishabh Pant: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. SENA దేశాల్లో తొలి వికెట్ కీపర్‌గా అరుదైన ఘనత.. మరో రికార్డు కూడా బ్రేక్..!
ట్రెండింగ్
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!