Koti Deepotsavam 2026 Day 9: కోటి దీప యజ్ఞంలో నేడు మరో విశేష ఘట్టం.. కంచి కామాక్షి మహాభిషేకం, మీనాక్షి కల్యాణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2026 Day 9: కార్తీక మాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం–2026 వేడుకలు భక్తి పారవశ్యంతో కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, కల్యాణోత్సవాలతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నాయి. ఈ క్రమంలో నవంబర్ 22, ఆదివారం తొమ్మిదో రోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. కార్తీక ఆదివారం, ప్రదోష పర్వదినం సందర్భంగా పలు విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
నేటి కోటి దీపోత్సవం ప్రత్యేక కార్యక్రమాలు ఇవే!
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
- Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
- Koti Deepotsavam 2026: కన్నుల పండుగగా కోటి దీపోత్సవం.. నేడు ఎనిమిదో రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఇవే!
- Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
అనుగ్రహ భాషణం
నేటి కార్యక్రమాల్లో భాగంగా జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామీజీ అనుగ్రహ భాషణం భక్తులకు మార్గదర్శనం చేయనుంది. మూలామ్నాయ కంచి సర్వజ్ఞ పీఠాధిపతీశ్వరులైన స్వామీజీ ఆశీస్సులు, ఆధ్యాత్మిక సందేశాలు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ప్రవచనామృతం
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ నందూరి శ్రీనివాస్ ప్రవచనామృతం వినిపించనున్నారు. ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం ద్వారా భక్తులకు ధర్మం, భక్తి, ఆధ్యాత్మిక విషయాలపై సందేశాన్ని అందించనున్నారు.
వేదికపై ప్రత్యేక పూజలు
తొమ్మిదో రోజు వేడుకల్లో భాగంగా వేదికపై రెండు ప్రధాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కంచి కామాక్షి మహాభిషేకం, చందనాలంకార దర్శనం, కోటి సుపుష్పకుంకుమల సమర్పణోత్సవం. ఉజ్జయిని మహాకాళుని భస్మహారతి.. ఈ ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.
భక్తులచే ప్రత్యేక పూజ
కంచి కామాక్షి విగ్రహాలకు భక్తుల చేతుల మీదుగా పసుపు కుంకుమల అర్చన నిర్వహించనున్నారు. భక్తులు ఈ పూజలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందే అవకాశం కల్పించనున్నారు.
కల్యాణోత్సవం
నేటి కార్యక్రమాల్లో మరో ప్రధాన ఆకర్షణగా మధురై శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణం నిర్వహించనున్నారు. ఈ దివ్య కల్యాణోత్సవం భక్తులకు కనుల పండువగా నిలవనుంది.
వాహన సేవ
కార్యక్రమాల ముగింపులో పల్లకి వాహన సేవ నిర్వహించనున్నారు.
కార్తీక మాసంలో నిర్వహిస్తున్న ఈ కోటి దీపోత్సవంలో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. తొమ్మిదో రోజు కంచి కామాక్షి మహాభిషేకం, ఉజ్జయిని మహాకాళుని భస్మహారతి, మధురై మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణం వంటి విశేష కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ మరింత పెరగనుంది. ఇవాళ్టి తొమ్మిదో రోజు కార్యక్రమంలో పాల్గొనాల్సింది భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్..

తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 9: కోటి దీప యజ్ఞంలో నేడు మరో విశేష ఘట్టం.. కంచి కామాక్షి మహాభిషేకం, మీనాక్షి కల్యాణం!
-
KavyaAnirudh Reception: ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు.. సీఎం విజయ్, మాజీ సీఎంలు స్టాలిన్, పళనిస్వామి
-
IND A vs PAK A: నేడు ఆసియా కప్‌లో దాయాదుల సమరం..! పాకిస్థాన్‌తో భారత్ కీలక పోరు..
-
Rishabh Pant Record: సిక్సర్‌తో సెంచరీ.. టాప్‌లో సచిన్.. రిషభ్ పంత్ స్థానం ఇదే!
-
BJP MP Ramrao Wadkute: 8 నెలల క్రితమే రాజ్యసభకు ఎంపిక.. బీజేపీ ఎంపీ గుండెపోటుతో మృతి
ట్రెండింగ్
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!