School Reunion Turns Tragic: స్కూల్ రీయూనియన్‌లో పరిచయం.. ప్రేమ, అనుమానం, అసూయతో డబుల్ మర్డర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Reunion Turns Tragic: పాఠశాల రోజుల్లోని స్నేహం.. కొన్నాళ్లకు ప్రేమగా మారింది. అయితే ఆ బంధంలో అనుమానాలు, అసూయలు చోటుచేసుకోవడంతో ఇద్దరి ప్రాణాలు బలయ్యాయి. తనతో సన్నిహితంగా ఉండటం లేదని భావించిన ఓ వ్యక్తి, మరో వ్యక్తితో ఆమెకు సంబంధం ఉందనే అనుమానంతో ఇద్దరినీ కిరాతకంగా హత్య చేసిన ఘటన తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ కేసులో నిందితుడిని సంజయ్ గాంధీగా గుర్తించారు. తిరువణ్ణామలై జిల్లాలోని ఓ పాఠశాలలో మాలిని, సంజయ్ గాంధీ కలిసి చదువుకున్నారు. గతేడాది జరిగిన స్కూల్ రీయూనియన్‌లో వీరిద్దరూ మళ్లీ కలుసుకున్నట్లు తెలిపారు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇటీవల మాలిని సంజయ్ గాంధీకి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తి రంజిత్ కుమార్‌కు దగ్గరవుతోందని సంజయ్ అనుమానించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో తీవ్ర అసూయకు లోనైన నిందితుడు ఇద్దరినీ హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు.
Also Read
- KavyaAnirudh Reception: ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు.. సీఎం విజయ్, మాజీ సీఎంలు స్టాలిన్, పళనిస్వామి
- BJP MP Ramrao Wadkute: 8 నెలల క్రితమే రాజ్యసభకు ఎంపిక.. బీజేపీ ఎంపీ గుండెపోటుతో మృతి
- Kavya -Anirudh Reception: కావ్య-అనిరుధ్ గ్రాండ్ రిసెప్షన్.. సీఎం విజయ్ స్పెషల్ గిఫ్ట్.. రజనీ, కమల్ ఆప్యాయపు నవ్వులు..
- Tragedy: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
మాలిని, రంజిత్ కుమార్ ఇద్దరూ బంధువులని సమాచారం. వీరిద్దరూ ఓ క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో వారిని వెంబడించి నిందితుడు వారిపై కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ జంట హత్యల కేసులో సంజయ్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన అసూయే హత్యలకు కారణమై ఉండొచ్చని ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యలకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ జంట హత్యల ఘటన తమిళనాడు రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోందంటూ ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజావార్తలు
-
Road Accidents: దేవుడి దర్శనం కోసం వెళ్లి మృత్యుఒడిలోకి.. ఒకే రాత్రి 12 మంది మృతి, 21 మందికి గాయాలు
-
School Reunion Turns Tragic: స్కూల్ రీయూనియన్‌లో పరిచయం.. ప్రేమ, అనుమానం, అసూయతో డబుల్ మర్డర్..!
-
Koti Deepotsavam 2026 Day 9: కోటి దీప యజ్ఞంలో నేడు మరో విశేష ఘట్టం.. కంచి కామాక్షి మహాభిషేకం, మీనాక్షి కల్యాణం!
-
KavyaAnirudh Reception: ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు.. సీఎం విజయ్, మాజీ సీఎంలు స్టాలిన్, పళనిస్వామి
-
IND A vs PAK A: నేడు ఆసియా కప్‌లో దాయాదుల సమరం..! పాకిస్థాన్‌తో భారత్ కీలక పోరు..
ట్రెండింగ్
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!