ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణలో కీలక అంశాలు ప్రస్తావించారు. అప్పటి మున్సిపల్ శాఖ మినిస్టర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ తెలిపారు. HMDW ఖాతా నుంచి FEO కంపనీకి నిధులు మల్లింపుపై నా ప్రమేయం ఆయన లేదని తేల్చి చెప్పారు.
Balmuri Venkat : ఫార్ములా ఈ కార్ రేసు కేసులో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే క్రమంలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ వేశారు. “చట్టంపై గౌరవం ఉందని చెబుతున్న కేటీఆర్ అదే సమయంలో విచారణను డైవర్ట్ చేయడానికి నాటకాలాడుతున్నాడు” అంటూ ఆయన విమర్శించారు. ప్రజల ఎదుట తాను నిర్దోషినంటూ సత్యహరిశ్చంద్రుడిలా నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. విచారణకు హాజరయ్యేందుకు మేం ఎవరినీ బలవంతంగా పిలవలేం కానీ, ఒక…
KTR : ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో మరోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులతో తనను లక్ష్యంగా చేసుకుని రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని ఆరోపించిన ఆయన, జైలుకు వెళ్ళేందుకు కూడా తాను సిద్ధమని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ వద్ద సోమవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్,…
Formula E Race Case : ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో హెచ్‌ఎండీఏ (HMDA) మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డి (BLN Reddy) ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యారు. శుక్రవారం జరిగే విచారణలో, బీఎల్‌ఎన్ రెడ్డి నుండి హెచ్‌ఎండీఏ నిధులను ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO) సంస్థకు బదిలీ చేసిన అంశంపై ఏసీబీ తన విచారణను కొనసాగించనుంది. ఈ విచారణలో బీఎల్‌ఎన్ రెడ్డి పై ప్రశ్నలు సంధించడానికి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్…
FIR On KTR: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు విషయంలో తెలంగాణలోని ఏసీబీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) లేఖ రాసింది. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలను ఇవ్వాలని ఈడీ కోరింది. కేటీఆర్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండీఏ ఖాతాల నుంచి నగదు బదిలీకి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలంటూ ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. దీనితో పాటు దాన కిషోర్ కేసు వివరాలను కూడా పంపాలని కోరింది. ఎంత మొత్తం…
Andhra Pradesh: గనుల శాఖ మాజీ డైరెక్టర్, ఏపీఎండీసీ మాజీ ఎండీ వీజీ వెంకట రెడ్డిపై ఏసీబీ విచారణకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏసీబీ డీజీకి సర్కార్ సమాచారం అందించింది.
హెచ్ఎండీఏ కృష్ణకుమార్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణకుమార్, శివ బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కృష్ణ కుమారుని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.