వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎవరు అధైర్య పడవద్దు….119 సీట్లలో 39 సీట్లు గెలిచినం…బలమైన ప్రతిపక్షంగా ఉన్నామన్నారు. 14 సీట్లు ఐదు వేల ఓట్లతో ఓటమి పాలైనం…అందులో సగం గెలిచినా హంగ్ వచ్చేదని, 14 ఏళ్ళు అభివృద్ధి బాటలో కారు వంద కిలోమీటర్ల స్పీడ్ తో పోయిందన్నారు కేటీఆర్. కారు సర్వీసింగ్ కు పోయింది… మళ్లీ వంద స్పీడుతో దూసుకొస్తదని, మార్పు కావాలి అనోళ్ళు నెత్తినోరు కొట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదన్న కేసీఆర్ మాటలు కాంగ్రెస్ సర్కార్ నిజం చేస్తోందని, రేవంత్ రెడ్డి చెప్పిన రెండు లక్షల ఋణమాఫీ ఏది అని ఆయన అన్నారు. ఇప్పటి వరకు రైతు బంధు పైసలు పడలే…కేసీఆర్ ప్రభుత్వంలో వారం రోజుల్లో రైతు బంధు పడేదని, స్విట్జర్లాండ్ పోయి రైతు భరోసా ఇస్తున్న అంటూ పచ్చి అబద్దాలు చెప్పిండు రేవంత్ రెడ్డి. …కాంగ్రెస్ అంటేనే మోసాలకు మారు పేరన్నారు. హామీ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు…420 హామీలు అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. ఇచ్చిన 420 హామీలను నెరవేర్చలేక కేసీఆర్ అప్పుల పాలు చేసిండంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఉచిత బస్సు తో మహిళలు కొట్టుకునే పరిస్థితి అని ఆయన అన్నారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్ లు రోడ్డున పడ్డారని,
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఓ గల్లీ కాంగ్రెస్ కార్యకర్త మాట్లడినట్టు ఉందన్నారు కేటీఆర్. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి చౌరస్తాలో నిలబెడతామని, రైతు బంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టమన్నడు మంత్రి కోమటిరెడ్డి అని ఆయన అన్నారు. చెప్పుతో కొడతామన్న కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో కొట్టాలే అని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ పెద్ద నేతలను ఓడగొట్టింది బీఆర్‌ఎస్ కాదా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి బీఆర్‌ఎస్‌కు పొత్తు ఉంటే మా ఆడ బిడ్డపై కేసు ఉంటుండెనా అని ఆయన అన్నారు. అదాని దొంగ అన్న రేవంత్ రెడ్డి… స్విట్జర్లాండ్ లో అలాయ్బలాయ్ తీసుకుంటడని, పూడూరులో న్యావి రాడార్ స్టేషన్ కోసం పర్యావరణం దెబ్బ తింటదని స్థానికులు చెబుతున్నారన్నారు.
అంతేకాకుండా..’అది మాకు తెలిసే ఆ ప్రాజెక్టు పదేళ్ళుగా ఆపుతూ వస్తున్నాం. పన్నెండు లక్షల చెట్లు నరికే ప్రయత్నం చేస్తే పర్యావరణ వేత్తలు ఎక్కడపోయిండ్రు. చెట్లు నరికితే వర్షాలు పడతాయా…మూసి నదికి ముప్పు లేదా. ప్రజాభిప్రాయ సేకరణ చేయరా…అవగాహనా సదస్సులు పెట్టరా… ఉన్న అడవి పోతది…పర్యావరణం దెబ్బతింటుంది… మన ప్రాంతానికి ఏం రాందు. రాడార్ స్టేషన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి బీఆరెస్స్ పార్టీ అండగా ఉంటది. 50 రోజుల్లోనే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోంటుంది…రానున్న రోజుల్లో ఇంకా చాలా చూస్తాం. కాంగ్రేసోళ్ళు ఐదేళ్లు ఉంటారా…మధ్యలో పోతారా చూస్తాం… మూడు అడుగులు లేనోడు బీఆరెస్స్ పార్టీని వంద మీటర్ల లోతులో పెడ్తడంటా… అందరూ కలిసి కట్టుగా పనిచేయాలే…పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించాలే. వరుసగా ఎన్నికలొస్తున్నయ్…అందరూ అప్రమత్తంగా ఉండాలే….కష్టపడి పార్టీ గెలుపుకు కృషి చేయాలే. 12 మంది ఎంపీలు గెలిస్తే జాతీయ పార్టీలకు వణుకు పుడుతది. శ్రీ రాముని పేరిట అక్షింతలు పంచి సెంటిమెంట్ రగిలించి ఓట్లు వేయించుకునే ప్రయత్నం బీజేపీ పార్టీది. పప్పు, ఉప్పు, పెట్రోల్, డిజీల్ ధరలు పెంచిన మోడీని దేవుడు అంటడు బండి సంజయ్. పార్లమెంట్ ఎన్నకల కోసం సిద్దం కావాలే….రంజిత్ రెడ్డిని గెలిపించుకోవాలే…..
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎస్ గార్డెన్ లో కార్యకర్తలతో నిర్వహించిన కేటీఆర్ సమావేశం. కారు సర్వీసింగ్ కి వెళ్లి వచ్చింది అదే స్పీడుతో దూసుకు వెళ్తుంది.. ప్రతీకారం పార్లమెంట్ ఎన్నికల్లో తీర్చుదాం.. రైతుబంధు పడలేదు చెప్పిన వారిని చెప్పుతో కొడదామా ఓటుతో కొడదామా. డిసెంబర్ 9న ఇచ్చిన హామీలను, ఆరు గ్యారెంటీలను రెండు లక్షల రుణమాఫీ రైతుబంధు పది వేల నుంచి పదిహేను వేలు అన్న వారిని దేనితో కొడదాం మాజీమంత్రి కేటీఆర్… పచ్చి మోసం కాంగ్రెస్ నేజం… కాంగ్రెస్ ఆరు గారెంటీలు కావు 420 గ్యారంటీలు… డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ ఫై సంతకం ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి పై మండిపడ్డ కేటీఆర్… రైతు భరోసా పేరుతో దావోద్ లో అంతర్జాతీయ నివేదికలపై తప్పుడు నివేదికలు ఇచ్చి వచ్చి అబద్ధాలు చెప్పారు… పూడూరు మండల్ దామగుండంలో 3000 ఎకరాలను నేవీ రాడర్ కు అప్పగించి 12 లక్షల చెట్లు, పర్యావరణం, జీవవైవిధ్యం పై దెబ్బ… నేవీ రార్డర్ ని రానివ్వకుండా గతంలో అడ్డుకున్నాం… రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 100 స్పీడుతో దూసుకు వస్తుంది కారు… చేవెళ్ల పార్లమెంట్లో భారీ మెజారిటీతో రంజిత్ రెడ్డి గెలవనున్నారు…’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.