KTR: కేటీఆర్‌కు బిగ్ షాక్.. విచారణకు గవర్నర్ అనుమతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ ఫార్ములా -కారు రేసు కేసుకు సంబంధించి ఆయనపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. ఈ కేసులోనిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ అనుమతితో ఏసీబీ త్వరలోనే కేటీఆర్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేయనుందని సమాచారం. కాగా ఈ కేసులో కేటీఆర్‌ను ఏ-1 గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏ-2గా ఏసీబీ పేర్కొంది. ఇప్పటికే కేటీఆర్ ఈ కేసు విషయంలో ఏసీబీ విచారణకు నాలుగు సార్లు హాజరయ్యారు.
ఈ కేసులో ఏ-2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు ఇప్పటికే కేంద్రంలోని డీఓపీటీకు లేఖ రాశారు. గవర్నర్ అనుమతి నేపథ్యంలో, చార్జ్‌షీట్ దాఖలుకు ముందు ఏసీబీ అధికారులు మరోసారి కేటీఆర్‌ను లేదా ఇతర కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది. ఈ కేసుపై గవర్నర్ అనుమతి లభించడంతో, రాజకీయ వర్గాలలో, పరిపాలనా వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ త్వరలో దాఖలు చేయబోయే చార్జ్‌షీట్‌తో ఈ కేసు విచారణ కీలక మలుపు తిరగనుంది. తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ అనుమతి ఇచ్చారు. దీంతో, ఈ-కారు రేసు కేసులో కేటీఆర్‌పై ఛార్జ్‌షీట్ వేసేందుకు గవర్నర్ అనుమతి లభించినట్టు అయ్యింది. అయితే, కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
Supreme Court: రాష్ట్రపతి, గవర్నర్ ‘‘బిల్లుల’’ అధికారాలపై నేడు సుప్రీంకోర్టు తీర్పు..
కాగా, ఫార్ములా ఈ-కారు రేసులో క్విడ్ ప్రోకో జరిగినట్టు ఏసీబీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. రూ.54.88 కోట్ల నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఇప్పటికే నాలుగు సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇక, 2024లో ఫార్ములా ఈ-కారు కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫార్ములా ఈ- కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏసీబీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఫార్ములా ఈ – కార్ రేస్ వ్యవహారంలో 2024 డిసెంబర్ నెలలో ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కేసు విచారణలో భాగంగా ఇప్పటికే కేటీఆర్‌ను రెండు సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను 3 సార్లు ఏసీబీ అధికారులు విచారించారు. తాజాగా ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ – కార్ రేస్ కేసుకు సంబంధించిన నివేదికను అవినీతి నిరోధక శాఖ( ఏసీబీ) అధికారులు మంగళవారం తెలంగాణ ప్రభుత్వానికి అందించారు. ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు రెండుసార్లు విచారించారు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్‌ను మూడుసార్లు ప్రశ్నించారు. తాజాగా నివేదిక సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే కేటీఆర్ , అరవింద్ కుమార్‌పై ఏసీబీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు గతేడాది డిసెంబర్ నెలలో ఫార్ములా ఈ – కార్ రేస్ కేసులో కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదైంది. ఫార్ములా ఈ – కార్ రేస్ కోసం రూల్స్‌కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించారని మున్సిపల్ శాఖ కార్యదర్శి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. దీని వలన ప్రభుత్వానికి రూ.54.88 కోట్లు నష్టం కలిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను ఈ కేసులో ఏ1గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. అలాగే అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌ను ఏ2గా చేర్చారు. HMDA చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఏ3గా ఉన్నారు.
FIFA World Cup 2026: నువ్వా.. నేనా.. ఫిఫా వరల్డ్‌కప్ బరిలో 48 దేశాలు..!
ఫార్ములా- ఈ కార్ రేసు నిర్వహణ కోసం యూకేకు చెందిన ఫార్ములా-ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్స్ట్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ పురపాలకశాఖ 2022 అక్టోబరు 25న ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం కార్ రేస్ నిర్వహణకు అయ్యే ఖర్చును స్పాన్సర్‌గా ఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ భరించాలి. అలాగే కార్ రేసు నిర్వహణకు వీలుగా తెలంగాణ పురపాలక శాఖ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా 2023 ఫిబ్రవరి 11 జరిగిన రేస్ కోసం తెలంగాణ పురపాలక శాఖ తరుఫున హెచ్ఎండీఏ రూ.12 కోట్లు ఖర్చు చేసింది. రేసు నిర్వహణ ఖర్చును స్పాన్సర్‌గా ఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ భరించింది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!