Google Mapsలో సూపర్ అప్డేట్.. హోటల్ బుకింగ్ నుంచి ఫుడ్ ఆర్డర్ వరకు అన్నీ ఒకేచోట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Maps ఇప్పటి వరకు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే.. వెంటనే గమ్యస్థానం టైప్ చేస్తే.. ఎలా వెళ్లాలి.. ఎటు నుంచి వెళ్తే త్వరగా చేరుకోవచ్చు అనేది సూచిస్తుంది.. ఒకవేళ దారి తప్పినా.. వెంటనే మరో మార్గాన్ని సూచిస్తుంది.. గూగుల్ మ్యాప్స్ అంటే ఒక ప్రదేశానికి వెళ్లే మార్గాన్ని చూపించే యాప్‌గా మాత్రమే చాలామంది ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ పూర్తిస్థాయి AI ట్రావెల్ అసిస్టెంట్‌గా మారుతోంది. గూగుల్ తన జెమిని (Gemini) ఆధారిత ‘Ask Maps’ ఫీచర్‌కు పలు కొత్త సామర్థ్యాలను జోడించింది. ఈ అప్డేట్తో వినియోగదారులు కేవలం దారి అడగడమే కాకుండా, హోటల్ బుక్ చేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, ట్రిప్ ప్లాన్ చేయడం, తమ అభిరుచులకు అనుగుణంగా సూచనలు పొందడం వంటి అనేక పనులను ఒకే యాప్‌లో చేయగలరు. ఈ కొత్త ఫీచర్లు భారతీయ వినియోగదారులకు కూడా దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి.
AIతో మరింత తెలివైన ‘Ask Maps’
గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం, జెమిని AI సహాయంతో Ask Maps ఇప్పుడు వినియోగదారుల ప్రశ్నలను మనిషిలా అర్థం చేసుకోగలదు. ఉదాహరణకు, “దారిలో త్వరగా ఆహారం దొరికే, శాకాహార వంటకాలు కూడా ఉన్న రెస్టారెంట్ చెప్పు” అని అడిగితే, కేవలం రెస్టారెంట్ల జాబితా మాత్రమే కాకుండా, మీ అవసరాలకు సరిపోయే ఉత్తమ ఎంపికను సూచిస్తుంది. అంతేకాకుండా, అవసరమైతే ఫుడ్ ఆర్డర్ ప్రక్రియను కూడా ప్రారంభిస్తుంది. ప్రస్తుతం ఈ సేవ Square, Toast వంటి భాగస్వామ్య ప్లాట్‌ఫారమ్‌లతో పనిచేస్తుండగా, భవిష్యత్తులో Uber Eats మద్దతు కూడా అందుబాటులోకి రానుంది. అయితే తుది చెల్లింపును వినియోగదారుడే పూర్తి చేయాల్సి ఉంటుంది.
Also Read
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
- Oppo Pad Mini: భారత్‌లో Oppo Pad Mini లాంచ్.. 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ, ధర ఎంతంటే?
- Huawei Pura 90 Plus: Huawei Pura 90 Plus లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 50MP కెమెరాలతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్!
- Motorola Razr Flex లీక్.. 50MP కెమెరాలు, 5000mAh బ్యాటరీతో కొత్త ఫోల్డబుల్ ఫోన్!
హోటల్ ఎంపిక కూడా మరింత సులభం
కొత్త AI ఫీచర్‌తో హోటల్ వెతకడం కూడా చాలా సులభం కానుంది. ఉదాహరణకు, “విమానాశ్రయానికి దగ్గరగా, తక్కువ ధరలో, జిమ్ సౌకర్యం ఉన్న, మంచి రెస్టారెంట్ సమీపంలో ఉన్న హోటల్ కావాలి” అని అడిగితే, ఆ ప్రమాణాలకు సరిపోయే హోటళ్లను సూచిస్తుంది. ఆ తర్వాత వినియోగదారులు హోటల్ అధికారిక వెబ్సైట్ లేదా బుకింగ్ భాగస్వామి ద్వారా గదిని రిజర్వ్ చేసుకోవచ్చు.
Gmail, Calendar ఆధారంగా వ్యక్తిగత సూచనలు
ఈ అప్డేట్లో మరో కీలక ఫీచర్ పర్సనల్ ఇంటెలిజెన్స్. వినియోగదారు అనుమతి ఇస్తే, Ask Maps Gmailలోని ఫ్లైట్ టికెట్లు, హోటల్ బుకింగ్‌లు, ఈవెంట్ వివరాలు వంటి సమాచారాన్ని విశ్లేషించి, ప్రయాణానికి అనువైన మార్గాలు, సందర్శించాల్సిన ప్రదేశాలు, భోజన ఎంపికలు వంటి వ్యక్తిగత సూచనలు అందిస్తుంది. భవిష్యత్తులో Google Calendar సమాచారం కూడా ఉపయోగించనుంది. అయితే ఈ ఫీచర్ పూర్తిగా ఐచ్ఛికం (Optional) అని, డిఫాల్ట్‌గా ఆఫ్‌లోనే ఉంటుందని గూగుల్ స్పష్టం చేసింది.
మునుపటి సంభాషణలు కూడా గుర్తుంచుకుంటుంది
Ask Maps ఇప్పుడు మీ పాత సంభాషణలను కూడా గుర్తుంచుకుంటుంది. ఒక ట్రిప్ ప్లాన్‌ను మధ్యలో ఆపి, తర్వాత మళ్లీ యాప్ తెరిచినా, మొదటి నుంచి వివరాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. గతంలో ఎక్కడ ఆపారో అక్కడి నుంచే సంభాషణను కొనసాగించవచ్చు. బస్సులు, రైళ్లు, మెట్రో, ఫెర్రీ వంటి ప్రజా రవాణా సేవలపై కూడా ఇప్పుడు ప్రత్యక్ష సమాచారం (Live Updates) అందుబాటులో ఉంటుంది. ఆలస్యాలు, మార్గ మార్పులు వంటి వివరాలను కూడా యాప్ రియల్ టైమ్‌లో తెలియజేస్తుంది.
భారతీయులకు శుభవార్త.. హిందీలో కూడా సేవలు
భారతీయ వినియోగదారుల కోసం మరో ప్రత్యేక అప్డేట్ను కూడా గూగుల్ ప్రకటించింది. Ask Maps ఫీచర్ ఇప్పుడు హిందీ భాషకు కూడా మద్దతు ఇవ్వనుంది. దీంతో వినియోగదారులు హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రాంతాలు లేదా ప్రయాణానికి సంబంధించిన ప్రశ్నలను హిందీలో అడిగి సమాధానాలు పొందవచ్చు. ఈ ఫీచర్‌ను భారతదేశంలో దశలవారీగా విడుదల చేస్తున్నారు. మొత్తంగా చూస్తే, గూగుల్ మ్యాప్స్ ఇకపై కేవలం దారి చూపే యాప్ మాత్రమే కాదు. AI ఆధారిత స్మార్ట్ ట్రావెల్ అసిస్టెంట్‌గా మారి, ప్రయాణ ప్రణాళిక నుంచి హోటల్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ వరకు అనేక సేవలను ఒకే వేదికపై అందించే దిశగా అడుగులు వేస్తోంది.
తాజావార్తలు
-
Vidadala Rajini: విడదల రజిని ఇంటి వద్ద హైటెన్షన్.. ఎస్సై చర్యతో కిందపడ్డ మాజీ మంత్రి..
-
Annamalai: CJPకి ఎప్పటికీ మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. అన్నామలై కీలక వ్యాఖ్యలు..
-
DK Shivakumar: మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి, నాపై స్టింగ్ ఆపరేషన్.. డీకే శివకుమార్ సంచలన ఆరోపణ..!
-
The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో ‘ది ప్యారడైజ్’!
-
BJP: కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీ vs రాహుల్ గాంధీ.. బీజేపీ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!