FIFA World Cup 2026: ఫుట్‌బాల్ వరల్డ్ కప్ (ఫిఫా)-2026కు అర్హత పొందిన దేశాలు తమ గ్రూప్ ప్రత్యర్థులను తెలుసుకునే రోజు ఆసన్నమైంది. డిసెంబర్ 5న జరగనున్న గ్రూప్ డ్రా ఈ ప్రపంచ కప్‌లో కీలక ఘట్టంగా నిలవనుంది. ఈసారి ఫిఫా వరల్డ్ కప్ 48 జట్లతో సాగనుంది. ఈ వరల్డ్ కప్ కు USA, కెనడా, మెక్సికో మూడు దేశాలు సంయుక్తంగా ఆతిధ్యం ఇవ్వనున్నాయి. 2026 ప్రపంచ కప్ లో మొత్తం 104 మ్యాచ్ లలో 78 USAలో, 13 మెక్సికోలో, 13 కెనడాలో జరుగనున్నాయి. ఈ టోర్నమెంట్ జూన్ 11న మెక్సికో సిటీలోని అజ్టెకా స్టేడియంలో ప్రారంభమై.. జూలై 19న న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో ఫైనల్‌తో ముగుస్తుంది.
ఇక గ్రూప్ డ్రా డిసెంబర్ 5న శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో వాషింగ్టన్ DCలోని కెన్నెడీ సెంటర్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యే కూడా అవకాశం ఉంది. ఈ డ్రాలో 48 జట్లను మొత్తం 12 గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులో నాలుగు జట్లు ఉండనున్నాయి. ఇందులో భాగంగా పాట్ 1లో మూడు ఆతిథ్య దేశాలైన USA, కెనడా, మెక్సికో అలాగే ఫిఫా ర్యాంకింగ్స్‌లోని తొమ్మిది టాప్ జట్లును ఉంచుతారు.
kaantha OTT : దుల్కర్–రానా నటించిన ‘కాంత’ ఓటీటీ రిలీజ్‌పై తాజా అప్డేట్
ఇక పాట్ 2, 3, 4లో ర్యాంకింగ్స్ ఆధారంగా మిగిలిన జట్లు ఉండనున్నాయి. ఒకే ఖండానికి చెందిన జట్లు ఒక గ్రూపులో రాకూడదనే నిబంధన ఇక్కడ కొనసాగుతుంది. ఇందులో యూరప్‌కి 16 జట్లు ఉండటంతో ప్రతి గ్రూపులో గరిష్టంగా రెండు యూరోపియన్ జట్లు మాత్రమే ఉండేలా చూడనున్నారు. అలాగే యూరోపియన్, ఇంటర్ – కాంఫెడరేషన్ ప్లే ఆఫ్స్ ద్వారా వచ్చే ఆరుగురు జట్లను ఏ పాట్‌లో ఉంచాలన్న దానిపై ఫిఫా ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఇప్పటికే 42 జట్లు వరల్డ్ కప్‌కు అర్హత సాధించాయి. ఇందులో యూరప్ నుంచి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్‌తో సహా 16 జట్లు చోటు దక్కించుకున్నాయి. ఆసియా నుంచి ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా వంటి 8 జట్లు అర్హత పొందాయి. ఆఫ్రికా నుంచి మొరాకో, సెనెగల్ వంటి 9 జట్లు, కాన్కాకాఫ్ నుంచి USA, కెనడా, మెక్సికోతో సహా 6 జట్లు, దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనా, బ్రెజిల్, ఉరుగ్వే వంటి 6 జట్లు ఎంపికయ్యాయి. ఓషియానియా నుంచి న్యూజిలాండ్ అర్హత పొందింది. మిగిలిన 6 స్థానాలు ప్లే-ఆఫ్స్ ద్వారా నిర్ణయించబడతాయి. ఈ ఇంటర్ కాంఫెడరేషన్ ప్లే ఆఫ్స్‌లో ఆఫ్రికా, ఆసియా, ఓషియానియా, దక్షిణ అమెరికా నుంచి ఒక్కొక్క జట్టు, కాన్కాకాఫ్ నుంచి రెండు జట్లు పాల్గొంటాయి.
Ibomma Ravi: ఐబొమ్మ రవికి 5 రోజుల కస్టడీ.. నేటి నుంచి పోలీసుల విచారణ..!
ఇక కొత్త ఫార్మాట్ లో ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు జట్లు, అలాగే ఉత్తమ ఎనిమిది మూడో స్థాన జట్లు రౌండ్ ఆఫ్ 32కి చేరతాయి. మూడో స్థాన జట్ల ర్యాంకింగ్ పాయింట్లు, గోల్ డిఫరెన్స్, గోల్స్ స్కోర్, ఫెయిర్‌ప్లే కార్డు పాయింట్లు, చివరికి ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ కొత్త వ్యవస్థతో ప్రతి మ్యాచ్ ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. ఈ వరల్డ్ కప్ ద్వారా మరిన్ని జట్లకు అవకాశం లభించడం మాత్రమే కాదు.. అభిమానుల్లో కూడా భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. రాబోయే డ్రా ఈ మహా టోర్నమెంట్‌లో జట్ల భవితవ్యాన్ని నిర్ణయించే కీలక సమయంగా నిలవనుంది. మరి ఏ ఏ దేశాలు ఈ మహాసంగ్రామానికి అర్హత పొందాయంటే..
ఆతిథ్య దేశాలు (Co-hosts):
కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్.
ఆసియా (AFC):
ఆస్ట్రేలియా, ఇరాన్, జపాన్, జోర్డాన్, కొరియా రిపబ్లిక్, ఖతార్, సౌదీ అరేబియా, ఉజ్బెకిస్తాన్.
ఆఫ్రికా (CAF):
అల్జీరియా, కాబో వెర్డే, ఐవరీ కోస్ట్, ఈజిప్ట్, ఘానా, మొరాకో, సెనెగల్, దక్షిణ ఆఫ్రికా, ట్యునీషియా.
ఉత్తర అమెరికా (CONCACAF):
పనామా, హైటి, క్యూరసావో.
దక్షిణ అమెరికా (CONMEBOL):
అర్జెంటీనా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వడార్, పారా గ్వే, ఉరుగ్వే.
ఓషియానియా (OFC):
న్యూజిలాండ్.
యూరప్ (UEFA):
ఆస్ట్రియా, బెల్జియం, క్రోయేషియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, స్కాట్లాండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్.