KTR : ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ పూర్తయింది. ఉదయం 10:40 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగింది. దాదాపు 7 గంటలపాటు ఈడీ అధికారులు కేటీఆర్‌ను వివిధ అంశాలపై ప్రశ్నించారు. ఈడీ విచారణ తరువాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ కక్ష సాధిస్తున్నారని, నేను నిజాయతీ పరుడినన్నారు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండని, రేవంత్ రెడ్డి ఇంట్లో అయిన, న్యాయమూర్తులు సమక్షంలో లై డిటెక్షన్ రెడీ అని ఆయన అన్నారు. ఎన్ని పరీక్షలకయినా సిద్ధమని, విచారణకి 5కోట్ల నుండి 10కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. విచారణ సంస్థలను గౌరవించి ఏసీబీ, ఈడీ విచారణ కి హాజరు అయ్యానని, రెండు సంస్థలు ఒకే రకమైన ప్రశ్నలు ఆడిగారన్నారు కేటీఆర్. ఎన్ని ప్రశ్నలు అడిగిన చెబుతా అని, ఎన్ని సార్లు రమ్మని చెప్పిన వస్తా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
NEET-UG 2025: పెన్-పేపర్ పద్ధతిలో నీట్.. ఒకే రోజు, ఒకే షిఫ్ట్‌లో పరీక్ష..
అంతేకాకుండా..’విచారణ కి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ముఖ్యమంత్రి పై ఏసీబీ కేసు కేసు ఉంది కాబట్టి నా మీద కేసు బనాయించారు… రేవంత్ రెడ్డి కి ఒక ఆఫర్ ఇస్తున్న… నువ్వు ముందుకు రా నీకు ఇష్టమైన ఒక జడ్జ్ ముందు కూర్చుందాం.. నీ మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది… లై డిటెక్టర్ పరీక్ష జరిపిద్దాం… మీడియాలో లైవ్ చూపిద్దాం… 10 ,20 లక్షలు ఖర్చు మొత్తంలో అయిపోతుంది… దొంగ ఎవరో నిజాయితీగా ఉన్నది ఎవరు? అప్పుడే తెలుస్తుంది… ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా ఎన్నిసార్లైనా విచారణకు హాజరవుతా.. న్యాయం ధర్మం కచ్చితంగా గెలుస్తుంది.. అర పైసా అవినీతి జరగలేదని ఎనిమిది గంటల పాటు అడిగిన అదే విషయాన్ని చెప్పాను…’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది ఇతడే.. సీసీకెమెరా వీడియో వైరల్..