Site icon NTV Telugu

KTR : ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా సంతోషంగా లేరు

Ktr

Ktr

KTR : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు (కేటీఆర్) మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌ వేదికగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్న తీరును తీవ్రంగా ఎత్తిచూపారు.

కేటీఆర్ మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రావడం లేదు. ఇదే వారికి ప్రజల నుంచి వచ్చిన అసలైన తీర్పు,” అని పేర్కొన్నారు. జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్ అధిక ఆశ చూపిస్తూ ప్రజల చేత ఓట్లు వేయించుకున్నారని, ఇది తీరా మోసం చేసినట్లు అయ్యిందని విమర్శించారు.

కేటీఆర్ ప్రకారం, కాంగ్రెస్ నాయకులు ప్రజలతో “కెసిఆర్ కంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని” చెప్పి మాయమాటలు మాట్లాడారని ఆరోపించారు. ఈ మాయ మాటలకే మోసపోయి ప్రజలు ఓటు వేసి వారిని గెలిపించారని ఆయన అన్నారు. “ఒకసారి మోసపోతే అది వారి తప్పు కాదు. కానీ రెండోసారి మోసపోతే మాత్రం అది మన తప్పే అవుతుంది,” అని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

వచ్చే GHMC ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి కీలకమని పేర్కొంటూ, “మన తడాఖా ఢిల్లీ పెద్దలకు కూడా మరోసారి చూపాల్సిందే,” అని కార్యకర్తలను ఉత్తేజితులుగా మలిచారు. అలాగే వరంగల్ బహిరంగ సభను విజయవంతం చేయాలంటే, హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని కరువు కాల్చే విధంగా వాతపెట్టే విధంగా ప్రవర్తిస్తున్నాయని అన్నారు.

Puri Jagannadh : విజయ్‌ సేతుపతి- పూరి సినిమాలో బాలయ్య హీరోయిన్..

Exit mobile version