KTR: సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.. రేవంత్‌కు దమ్ముంటే 10 మందితో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.. ఎన్నికల్లో ఎవరి సత్తా ఏందో తేల్చుకుందామన్నారు.. జోగులాంబ జిల్లా గద్వాలలోని తేరు మైదానంలో నిర్వహించిన ‘గద్వాల గర్జన’ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయన్నారు.
ఢిల్లీ పర్యటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీకి వెళ్లడం నేరంగా మాట్లాడుతున్నారు.. కేంద్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రంతోనే మాట్లాడాలన్నారు. ఢిల్లీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లాలి.. ఫామ్ హౌస్ కి వెళ్ళాలా? అని ఫైర్ అయ్యారు. 33, 34 సార్లు ఢిల్లీకి వచ్చానని.. 48 సార్లు వచ్చానని మాట్లాడుతున్నారన్నారు. తన ప్రియారిటి రాష్ట్రమని.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ , వివాదాలను పరిష్కరించుకోవడం ముఖ్యమన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. 18వేల కోట్ల కాంట్రాక్టులు వదులుకో లేదంటే.. హైదరాబాద్ భాగ్యలక్ష్మి గుడికి రా.. మీ గుండు సంజయ్ మీద ఒట్టు వెయ్యి కాంట్రాక్టులు రాలేదని అంటూ ఛాలెంజ్ చేశారు.