Site icon NTV Telugu

KTR: “కాళేశ్వరాన్ని కూల్చింది వాళ్లే అని నా డౌట్..” మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Ktr

Ktr

మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరంపై నిజానిజాలు త్వరలో తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. “నా డౌట్ అయితే కాంగ్రెస్ వాళ్లే కూలగొట్టి ఉంటారు.. మేడిగడ్డ దగ్గర బాంబో లేదా మరొకటో పెట్టుంటారు.. కాంగ్రెస్‌లో అలాంటి పని చేసే వాళ్లు ఉన్నారు.” అని కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు.

READ MORE: India On Turkey: పాకిస్తాన్‌కి టర్కీ మద్దతు ఇవ్వడంపై భారత్ కీలక సూచనలు..

కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుందని కేటీఆర్‌ అన్నారు. ఒక బ్యారేజీలో 2 పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారని విమర్శించారని.. కమీషన్ల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కాళేశ్వరం డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఘోష్ విచారణ పూర్తయిందని అని చెప్పి.. ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు.

READ MORE: Aishwarya Rai : నేను బరువు పెరిగితే మీకేంటి.. ఐశ్వర్య రాయ్ సీరియస్..

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి అపరిచితుడిలా ఉన్నారని విమర్శించారు. అపరిచితుడి సినిమాలోని రెమో, రాము పాత్రలు ముఖ్యమంత్రికి అబ్బుతాయన్నారు. అప్పు పుట్టలేదని రెమో అంటారు.. రూ.లక్షా 60వేల కోట్లు రాము అప్పు చేశారని వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. ఉన్న డిక్లరేషన్లకే దిక్కు లేదని.. ఇప్పుడు నల్లమల డిక్లరేషన్‌ ఎందుకు? అని ప్రశ్నించారు. నెల రోజులుగా సీఎం మదిలో ఉన్నవి వరల్డ్‌ బ్యూటీస్‌, కేసీఆర్‌కు నోటీసుల అన్నారు. తాము కట్టిన వాటి ముందు వరల్డ్‌ బ్యూటీస్‌ ఫొటోలు దిగుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

READ MORE: Salman Khan: సల్మాన్‌ ఖాన్‌కు భద్రతా ముప్పు.. ఏకంగా ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు అరెస్ట్..

Exit mobile version