మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరంపై నిజానిజాలు త్వరలో తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. "నా డౌట్ అయితే కాంగ్రెస్ వాళ్లే కూలగొట్టి ఉంటారు.. మేడిగడ్డ దగ్గర బాంబో లేదా మరొకటో పెట్టుంటారు.. కాంగ్రెస్‌లో అలాంటి పని చేసే వాళ్లు ఉన్నారు." అని కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు.