మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరంపై నిజానిజాలు త్వరలో తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. "నా డౌట్ అయితే కాంగ్రెస్ వాళ్లే కూలగొట్టి ఉంటారు.. మేడిగడ్డ దగ్గర బాంబో లేదా మరొకటో పెట్టుంటారు.. కాంగ్రెస్‌లో అలాంటి పని చేసే వాళ్లు ఉన్నారు." అని కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు.
KTR : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కెటిఆర్) గురువారం తన నివాసం నుండి అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరారు. కేటీఆర్ వెంట ఆయన తరఫు న్యాయవాది రామచంద్రరావు, సీనియర్ బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. ఏసీబీ కార్యాలయానికి వెళ్లే ముందు కేటీఆర్ తన నివాసం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, తనపై కొనసాగుతున్న రాజకీయ ఆరోపణలపై ఘాటైన ప్రకటన చేశారు. విలేకరులతో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ కుమారుడిగా, రాష్ట్ర…