మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరంపై నిజానిజాలు త్వరలో తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. "నా డౌట్ అయితే కాంగ్రెస్ వాళ్లే కూలగొట్టి ఉంటారు.. మేడిగడ్డ దగ్గర బాంబో లేదా మరొకటో పెట్టుంటారు.. కాంగ్రెస్‌లో అలాంటి పని చేసే వాళ్లు ఉన్నారు." అని కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు.
Addanki Dayakar: తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న వివాదాల నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం లో తప్పులు జరిగాయనే కారణంతోనే కమిషన్ కొంత సమయం తీసుకుని నివేదిక రూపొందించిందని ఆయన అన్నారు. రాజకీయ కక్షతో కాదు, కేవలం అవినీతి చెందిన బాధ్యులను వెలికితీసే ఉద్దేశంతోనే విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్‌లో వివక్షకు అవకాశం లేదు. వివేక్, వంశీలపై ఎలాంటి వివక్ష లేదని…