పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. పామర్రు పోలీస్ స్టేషన్ కు ఇప్పటికే జిల్లా ఎస్పీ గంగాధర్ చేరుకున్నారు. మచిలీపట్నం లేదా పామర్రు పోలీస్ స్టేషన్ లో పేర్ని నానిపై కేసు నమోదు చేయనున్నారు.
వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు.. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్ - 30 అమలులో ఉన్నట్టు పేర్కొన్నారు.. ఈ సెక్షన్ అమలు నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.. అయతే, పోలీసుల నిషేదాజ్ఞలను అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు.