NTV Telugu Site icon

Singer Kalpana: జరిగింది ఇదే.. సింగర్ కల్పన కేసులో పోలీసుల వివరణ..

Singer Kalpana

Singer Kalpana

సింగర్ కల్పన మాత్రలు మింగి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. కేబీహెచ్‌బీ పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. సింగర్ కల్పన ఎర్నాకుళంలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. ఆమె నిద్ర పట్టకపోవడంతో జోల్ ఫ్రెష్ నిద్రమాత్రలు వేసుకున్నట్లు వెల్లడించారు. అవి వేసుకున్నా.. నిద్ర రాకపోవడంతో మరో 10 నిద్రమాత్రలు వేసుకొని అపస్మారక స్థితికి వెళ్లినట్లు తెలిపారు.

READ MORE: Singer Kalpana: “మా అమ్మది సూసైడ్ అటెంప్ట్ కాదు”.. కల్పన కుమార్తె కీలక వ్యాఖ్యలు..

పోలీసుల వివరాల ప్రకారం.. గత ఏది ఎళ్లుగా ఆమె భర్తతో కలిసి నిజాంపేట్ లోని విల్లాలో ఉంటున్నారు. కల్పన కూతురు దయా ప్రసాద్ చదువు విషయంలో ఆమెకు ఆమె కూతురు మధ్య మనస్పర్థలు వచ్చాయి. కల్పన నిన్న ఎర్నాకుళం నుంచి హైదరాబాద్ కి ఉదయం 11:45 నిమిషాలకు చేరుకుంది. ఒంటిగంట 40 నిమిషాలకు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర పట్టకపోవడంతో జోల్ ఫ్రెష్ నిద్రమాత్రలు వేసుకుంది. అయినా నిద్ర రాకపోవడంతో మరో 10 నిద్రమాత్రలు వేసుకొని అపస్మారక స్థితికి వెళ్ళిపోయింది. తర్వాత తనకి ఏం జరిగిందో తెలియదని స్టేట్మెంట్లో చెప్పింది.

READ MORE: Ajith : అజిత్ తో తలపడేందుకు ధనుష్ భయపడ్డాడా..?

కల్పనకు ఆమె భర్త ప్రసాద్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆయన కాలనీ వెల్ఫేర్ మెంబర్స్ కి ఫోన్ చేశాడు. డయల్ హండ్రెడ్ కి ఫోన్ చేసి చెప్పడంతో కల్పన కేపీహెచ్బీ పోలీసులు ఇంటికి చేరుకున్నారు. కల్పన మెయిన్ డోర్ ఎన్నిసార్లు కొట్టిన తీయకపోవడంతో కిచెన్ నుంచి లోపలికి ప్రవేశించారు. బెడ్రూంలో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను దగ్గర్లోని ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. నిద్రపట్టకపోవడంతో అధిక మొత్తంలో నిద్రమాత్రలు వేసుకోవడం వల్ల ఇలా జరిగిందని పోలీసులు స్టేట్మెంట్లో కల్పన చెప్పింది.