సింగర్ కల్పన మాత్రలు మింగి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. కేబీహెచ్‌బీ పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. సింగర్ కల్పన ఎర్నాకుళంలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. ఆమె నిద్ర పట్టకపోవడంతో జోల్ ఫ్రెష్ నిద్రమాత్రలు వేసుకున్నట్లు వెల్లడించారు. అవి వేసుకున్నా.. నిద్ర రాకపోవడంతో మరో 10 నిద్రమాత్రలు వేసుకొని అపస్మారక స్థితికి వెళ్లినట్లు తెలిపారు.