టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగడంతో ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆమె ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ కల్పన ఆత్మహత్యకు పాల్పడిందని, భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయని రకరకాల వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతం కోలుకున్న సింగర్ కల్పన తాజాగా ఓ వీడియో రిలీజ్ చేస్తూ ‘ మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పుడు వార్త …
సింగర్ కల్పన మాత్రలు మింగి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. కేబీహెచ్‌బీ పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. సింగర్ కల్పన ఎర్నాకుళంలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. ఆమె నిద్ర పట్టకపోవడంతో జోల్ ఫ్రెష్ నిద్రమాత్రలు వేసుకున్నట్లు వెల్లడించారు. అవి వేసుకున్నా.. నిద్ర రాకపోవడంతో మరో 10 నిద్రమాత్రలు వేసుకొని అపస్మారక స్థితికి వెళ్లినట్లు తెలిపారు.
తెలుగు పాపులర్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హైదరాబాద్‌లోని నిజాంపేటలో వర్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఘటన జరిగింది. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అందరూ భావిస్తుండగా.. తాజాగా ఆమె కుమార్తె సంచలన వ్యాఖ్యలు దయ ప్రసాద్ చేసింది. తన తల్లి కల్పన ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేసింది.