Shocking: అక్రమ సంబంధాలు కుటుంబాల్లో చిచ్చ పెడుతున్నాయి. ముఖ్యంగా, పెళ్లి అనంతరం వేరే వ్యక్తుల మోజులో పడిన మహిళలు భర్త, పిల్లల్ని వదిలేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగాయి. తాజాగా, ఉత్తర్ ప్రదేశ్ ఏటావా జిల్లాకు చెందిన 25 ఏళ్ల మహిళ తన భర్త, ముగ్గురు పిల్లల్ని వదిలేసి, ఇన్‌స్టాగ్రామ్ లవర్‌తో లేచిపోయింది. తన లవర్‌లో జీవించాలని అనుకుంటున్నానని కోర్టులో చెప్పింది. తన భర్త తాగుబోతు, జూదగాడు అని ఆరోపించింది.
Hyderabad Tragedy: మా ఆయిష్షు కూడా పోసుకొని నిండు నూరేళ్లూ వర్ధిల్లు అని దీవించాల్సిన చేతులతోనే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. దాంపత్య జీవితంలో గొడవలు, కుటుంబ కలహాలు, అనారోగ్య కారణాలు, ఆర్ధిక సమస్యలు.. ఇలా కారణాలు ఏవైవా కావొచ్చు. పెద్ద వాళ్ల సమస్యలకు చిన్నారులు సమిధలవుతున్నారు.. నిజానికి పిల్లలకు ఒంట్లో కాస్తంత నలతగా ఉంటేనే కన్నవారు తీవ్రంగా కలవరపడిపోతారు! ఆడుకుంటూ పొరపాటున కింద పడ్డ బిడ్డకు చిన్నగాయమైతేనే విలవిల్లాడిపోతారు.
భర్తలను భార్యలు మట్టుబెడుతున్న అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ ప్రరిడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.. బండరాయితో తలపై మోది భర్తను హత్య చేసింది భార్య. భర్త మద్యానికి బానిసై తరచూ తనను వేధిస్తున్నాడని భార్య ఆరోపించింది.
కుటుంబ కలహాలకు పిల్లలు బలవుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి. సొంత తల్లి లేదా తండ్రి వారి ఉసురు తీసే స్థాయికి దిగజారుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇద్దరు చిన్నారులను తండ్రి కర్కశంగా కడతేర్చాడు. అనంతరం సూసైడ్ చేసుకుంటున్నా అని లెటర్ రాసి పెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు అతడి మిస్సింగ్ కూడా ఇంకా మిస్టరీగానే ఉంది. కలహాల కాపురానికి చిన్నారులు బలి.కలహాల కాపురానికి చిన్నారులు బలి.. ఇద్దరి గొడవల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.భార్య, భర్త…
అత్త తన కోడలిపై గృహ హింస కేసు పెట్టవచ్చా? అలహాబాద్ హైకోర్టులో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. అలహాబాద్ హైకోర్టులో ఓ అత్త తన కోడలు గృహ హింసకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేసింది. తాజాగా కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. విచారణ సమయంలో.. అత్తగారు తన కోడలిపై ఇలాంటి కేసు పెట్టవచ్చా? అనే ప్రశ్న తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గరిమా తన కోడలితో పాటు 5 గురు కుటుంబీకులపై ఈ ఫిర్యాదు చేసింది.
క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆస్తుల కోసం కన్నతల్లిదండ్రులు, తోబుట్టువులుపై కూడా దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీ చాదర్ ఘాట్ లో దారుణం వెలుగుచూసింది. అక్క, అన్న పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు ఓ తమ్ముడు. ఈ దాడిలో సోదరుడికి తీవ్ర గాయాలు కాగా అక్క ప్రాణాలు కోల్పోయింది. లక్ష్మిని ఆమె సోదరుడు మదన్ బాబు కత్తితో దాడిచేసి చంపేశాడు. గాయపడిన సోదరుడిని…
సింగర్ కల్పన మాత్రలు మింగి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. కేబీహెచ్‌బీ పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. సింగర్ కల్పన ఎర్నాకుళంలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. ఆమె నిద్ర పట్టకపోవడంతో జోల్ ఫ్రెష్ నిద్రమాత్రలు వేసుకున్నట్లు వెల్లడించారు. అవి వేసుకున్నా.. నిద్ర రాకపోవడంతో మరో 10 నిద్రమాత్రలు వేసుకొని అపస్మారక స్థితికి వెళ్లినట్లు తెలిపారు.
Murder: నేటి ఆధునిక సమాజంలో సాంకేతికత పెరుగుతోంటే, మానవ సంబంధాలు మరుగున పడుతున్నాయి. ఒకప్పుడు మానవీయతకు, సంబంధాల సమతౌల్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు డబ్బు, ఆస్తుల కోసం నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. దుశ్చర్యలకు వెనకాడకుండా వెళ్ళిపోతున్నారు. ఎంతలా అంటే, రక్త సంబంధాలను కూడా వదిలిపెట్టకుండా, తమ దురాశ కోసం మరణాలకు కూడా కారణమవుతున్నారు. ఇటువంటి శోచనీయ సంఘటన పాల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో తండ్రి మరణానంతరం ఆర్థిక లాభాల కోసం జరిగిన ఘర్షణలు ముగ్గురు…
Wife Murdered Husband: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో దాంపత్య జీవితం ఒక భయంకరమైన ఘటనకు దారి తీసింది. పెళ్లయిన నాలుగో రోజున పాయల్ అనే మహిళ తన భర్త భావిక్‌ను ప్రేమికుడు కల్పేష్ సహాయంతో హత్య చేసింది. వివాహానికి ముందు పాయల్ తన బంధువు కల్పేష్‌తో ప్రేమలో ఉండగా.. వారి పెళ్ళికి పెద్దలు నిరాకరించారు. ఆ తర్వాత భావిక్‌తో పెళ్లి చేశారు. పెళ్లి అయిన తరువాత, పాయల్ తన ప్రేమికుడితో కలిసి కుట్ర పన్ని భావిక్‌ను హత్య చేసింది.…
Dead Body : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి నదిలో విషాదం నెలకుంది. గోదావరి నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన బొడ్డు సమ్మక్క(65) అనే మహిళ గత నెల 27 న తన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రాగా మనస్థాపం చెంది ఇంటి నుండి కనిపించకుండా వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమే కోసం గాలించగా ఎక్కడ ఆచూకీ లభించలేదు. టేకుమట్ల…