కార్తిక మాసం శుభవేళ.. రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో 'కోటి దీపోత్సవం' దిగ్విజయంగా కొనసాగుతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో 13వ రోజు మార్మోగిపోయింది. కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్న కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. రాష్ట్రపతికి కోటి దీపోత్సవం నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.
2024 కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘కోటి దీపోత్సవం’ విజయవంతంగా కొనసాగుతోంది. రోజుకో కల్యాణం, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలు, వాహనసేవ, పూజలతో భక్తులు పరవశించిపోతున్నారు. దీపాల వెలుగులు, వందలాది భక్తులతో ప్రతిరోజు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం కళకళలాడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ దీపాల పండుగలో పాల్గొని ఈ లోకాన్నే మరిచేలా పునీతులవుతున్నారు. కోటి దీపోత్సవంకు భక్తులతో పాటుగా ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. కోటి దీపోత్సవం 2024కు ముఖ్యఅతిథులుగా తెలంగాణ…