Koneru Hampi: 2024 సంవత్సరం చెస్‌లో భారతదేశానికి చిరస్మరణీయమైనదిగా మారింది. 2024 చివరిలో, భారత మహిళా చెస్ క్రీడాకారిణి హంపి కోనేరు పెద్ద ఘనతను మరోసారి సాధించింది. తాజాగా, 18 ఏళ్ల భారత చెస్ ప్లేయర్ డి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. కాగా, ఇప్పుడు 37 ఏళ్ల హంపి కోనేరు చరిత్ర సృష్టించింది. మహిళా చెస్ క్రీడాకారిణి ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇక్కడ విశేషమేమిటంటే.. హంపి ఈ టైటిల్‌ను రెండోసారి కైవసం చేసుకోవడం. భారత్‌కు చెందిన హంపి కోనేరు ఇండోనేషియాకు చెందిన ఐరీన్ సుకందర్‌ను ఓడించి ఈ టైటిల్‌ను గెలుచుకుంది.
Also Read: Flight Accidents: డిసెంబర్ నెలలో 6 విమాన ప్రమాదాలు.. 236 మంది మృతి..
2019లో జార్జియాలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను హంపి తొలిసారిగా గెలుచుకోగా.. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఇప్పుడు చరిత్ర సృష్టించింది. హంపి తన చారిత్రాత్మక విజయంపై దేశవ్యాప్తంగా అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గుకేష్ తర్వాత ఇప్పుడు దేశం మొత్తం హంపి సాధించినందుకు గర్విస్తోంది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు ప్రముఖులు కూడా అభినందనలు తెలిపారు.