మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని ఆయన సతీమణి కొండా సంగీతా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కే పురం, టెలిఫోన్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మోడీ మీద నమ్మకంతో బీజేపీ చేవెళ్లలో భారీ మెజారిటీతో గెలుస్తుందని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. చేవెళ్లలో తమ ఫస్ట్ రౌండ్ ప్రచారం అయిపోయిందని పేర్కొన్నారు. చేవెళ్లలో సర్వే చేయించాం.. గెలిచేది బీజేపీయేనని అన్నారు. చేవెళ్ల సీటు మోడీదే.. ఇది రాసి పెట్టుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీపై దుష్ప్రచారం జరుగుతోందని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అసెంబ్లీలో ఎన్నికల్లో కూడా అన్నారు.. లిక్కర్ కేసులో…