తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు మారుతున్న తరుణంలో.. నాయకులు ఆయా పార్టీలను విడిచి మరో పార్టీల కండువాలను కప్పుకుంటున్నారు. అయితే.. ఈ క్రమంలోనే చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, తుల ఉమాల కూడా టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరనున్నట్లు వార్తలు వినిపించాయి. దీనిపై తాజాగా కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, తుల ఉమాలు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, తులా ఉమాలు టీఆర్ఎస్ పార్టీకి పోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. మునుగోడులో బీజేపీ గెలుపు దిశగా పయనిస్తున్న నేపథ్యంలో ఉద్యమకారులపై తప్పుడు ప్రచారం జరిగేలాగా కుట్రకు తెరలేపారని వారు ఆరోపించారు. బీజేపీ గెలుపు కోసం కొండ విశ్వేశ్వర్ రెడ్డి జితేందర్ రెడ్డి తో పాటు నేను పది రోజుల్లో ఇక్కడే పనిచేస్తున్నానని తుల ఉమా వెల్లడించారు.
Read Also : Hyderabad Rains: భాగ్యనగరానికి భారీ వర్ష సూచన… ఈ సీజన్‌కు ఇదే లాస్ట్ అంటున్న వాతావరణ శాఖ
మాకు ఎలాంటి ఫోన్ రాలేదు మాకు ఫోన్ వచ్చిన మేము వాటికి రెస్పాండ్ అవ్వమని, ప్రలోభాలకు లొంగేవాళ్ళం కాదని వారు వెల్లడించారు. త్వరలో బీజేపీలో చేరే వాళ్ళ సంఖ్య పెరుగుతుందని, నలుగురు మాజీ ఎంపీలు ఇద్దరు మంత్రులు ఒకరు మంత్రి కొడుకు, ఒకరు మంత్రి అల్లుడు బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం కావడంతో కేసీఆర్ ఈ చేరికల కుట్ర చేస్తున్నాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి కొడుకులు ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీ గెలుపును ఆపలేరని, తెలంగాణలో బీజేపీ బలోపేతాన్ని అడ్డుకోలేరని వారు వెల్లడించారు.