Konda Surekha : ‘నన్ను అణచివేస్తున్నారు’.. రాహుల్‌కు సురేఖ ఫిర్యాదు.!
- రాహుల్‌కు పెన్‌డ్రైవ్‌తో లేఖ
- శాఖలో పక్కన పెడుతున్నారంటూ ఫిర్యాదు
- కడియం శ్రీహరిపై సంచలన ఆరోపణలు
- బీసీ మహిళననే టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. తనను రాజకీయంగా, పరిపాలనాపరంగా అణచివేస్తున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సంచలన లేఖ రాశారు. ఈ లేఖతో పాటు తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు, వీడియోలు ఉన్న ఒక పెన్‌డ్రైవ్‌ను కూడా ఆయనకు జత చేసి పంపడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
పరిపాలనలో పక్కనపెడుతున్నారు.. శాఖాపరమైన నిర్ణయాల్లో అలక్ష్యం
మంత్రిగా ఉన్నప్పటికీ తన నిర్ణయాధికారాన్ని క్రమంగా తగ్గిస్తున్నారని కొండా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి సమాచారం లేకుండానే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుంచే తన శాఖాపరమైన నిర్ణయాలు జరిగిపోతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా దేవాదాయ శాఖలోని కీలక నిర్ణయాల్లో తనను పూర్తిగా పక్కన పెడుతున్నారని తెలిపారు. యాదాద్రి టెంపుల్ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు విషయంలో కనీస సమాచారం కూడా ఇవ్వలేదని, అలాగే సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధి నిధులను తనను సంప్రదించకుండానే ఆర్అండ్బీ (R&B) శాఖకు బదిలీ చేశారని లేఖలో పేర్కొన్నారు. చివరకు శ్రీరామనవమి ప్రభుత్వ అధికారిక ప్రకటనల్లో తన ఫోటోను కూడా తొలగించారని వాపోయారు.
Also Read
వరంగల్ జిల్లా అభివృద్ధికి గండి.. కడియం శ్రీహరిపై ఫిర్యాదు
తన సొంత నియోజకవర్గమైన వరంగల్ తూర్పు అభివృద్ధి పనులకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని సురేఖ ఆరోపించారు. స్మార్ట్ సిటీ మోడల్ బస్ స్టాండ్, బొందివాగు విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. మరోవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రిగా ఉన్న తనకు చెప్పకుండానే దేవాదాయ శాఖ అధికారులతో నేరుగా సమీక్షలు నిర్వహించారని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పార్టీ నాయకత్వానికి ముందే తెలియజేసినప్పటికీ కడియం శ్రీహరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పార్టీలో అందరికీ సమాన నిబంధనలు అమలు కావడం లేదని ప్రశ్నించారు.
బీసీ మహిళా మంత్రిగా టార్గెట్ చేస్తున్నారు: కొండా సురేఖ ఆగ్రహం
తాను ఒక బీసీ మహిళా మంత్రిని కావడం వల్లే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారనే భావన కలుగుతోందని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబాన్ని రాజకీయంగా ఒంటరి చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తన కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేస్తూ పార్టీ షోకాజ్ నోటీసు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా తన కుటుంబంపై పక్కా ప్రణాళికతో రాజకీయ దాడులు జరుగుతున్నాయని, తన మాజీ ఓఎస్డీ (OSD) సుమంత్‌పై తీసుకున్న చర్యలు కూడా అందులో భాగమేనని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాలపై నిష్పక్షపాతంగా, సమగ్ర విచారణ జరిపించాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్‌పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
-
VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్‌కు అదిరే శుభవార్త..
-
Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
-
EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్‌తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
-
AP Cabinet Decisions: రైతులకు గుడ్‌న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!