Mallu Ravi : కొండా సురేఖ వ్యవహారంపై మల్లు రవి సంచలన వ్యాఖ్యలు
- కూతురు వ్యాఖ్యలే కారణం
- ఖర్గే వద్ద కూడా ఖండించలేదని వెల్లడి
- సమగ్ర విచారణ తర్వాతే నివేదిక
- ఎంతటి పెద్దవారైనా నిబంధనలు పాటించాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న వేళ, తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి ఎన్టీవీకి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. పార్టీలో ఎంతటి పెద్ద పదవిలో ఉన్నవారైనా క్రమశిక్షణ పాటించాల్సిందేనని, లక్ష్మణ రేఖ దాటితే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని ఆయన తేల్చి చెప్పారు.
కూతురు వ్యాఖ్యలను ఖండించకపోవడమే కారణం
కొండా సురేఖపై చర్యలు తీసుకోవడానికి ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలే ప్రధాన కారణమని మల్లు రవి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని ఎవరైనా బహిరంగంగా దూషిస్తే లేదా విమర్శిస్తే, దానిని వెంటనే ఖండించాల్సిన ప్రాథమిక బాధ్యత క్యాబినెట్ మంత్రిగా ఉన్న కొండా సురేఖపై ఉందన్నారు. కానీ, తన కూతురు తప్పు చేసిందని ఆఖరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద కూడా ఆమె ఒప్పుకోకపోవడం, కనీసం ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడం సరికాదన్నారు. పార్టీలో ఏవైనా సమస్యలు లేదా అభిప్రాయభేదాలు ఉంటే అంతర్గతంగానే పరిష్కరించుకోవాలి తప్ప రోడ్డున పడేయకూడదని హితవు పలికారు.
Also Read
- Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
- Off The Record: జీహెచ్ఎంసీలో ముద్ర కోసం ప్రభుత్వ ప్రయత్నాలు.. కార్పొరేషన్స్ ఎన్నికలపై దృష్టి.!
- PDS Rice : ఇబ్రహీం పట్నం లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత.. రైస్ మిల్లుపై దాడి
- Chikkadpally: యువతితో అసభ్య ప్రవర్తన.. ఘర్షణలో డీఆర్డీవో ఉద్యోగి మృతి
సమగ్ర విచారణ తర్వాతే నివేదిక
కొండా సురేఖపై గతంలో కూడా పలు ఫిర్యాదులు క్రమశిక్షణ సంఘానికి అందాయని మల్లు రవి వెల్లడించారు. చట్టప్రకారం ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే తాను క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా సమగ్ర నివేదికను తయారు చేసి అధిష్టానానికి ఇచ్చానని తెలిపారు. కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డి విషయంలోనూ పూర్తి వివరాలు సేకరించి, వారి వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని గుర్తించిన తర్వాతే రిపోర్ట్ సమర్పించామన్నారు. ఈ నిర్ణయంలో ఎలాంటి కులాల ప్రాతిపదికన చర్యలు ఉండవని, కేవలం పార్టీ క్రమశిక్షణ మేరకే జరిగాయని స్పష్టం చేశారు.
ఎంత పెద్దవారైనా లక్ష్మణ రేఖ దాటొద్దు
ఈ రాజకీయంపై రాష్ట్రమంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ఏఐసీసీ (AICC) నుంచి తుది నిర్ణయం వెలువడిందని తెలిపారు. నిర్ణయం తీసుకోవడం కొద్దిగా ఆలస్యమైనా పర్వాలేదు కానీ, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలనే ఉద్దేశంతోనే ప్రక్రియను నిర్వహించామని చెప్పారు. హోదా లేదా పదవి ఎంత పెద్దదైనా కాంగ్రెస్ పార్టీ నియమావళిని ఎవరూ అతిక్రమించకూడదని, పార్టీ నిర్దేశించిన లక్ష్మణ రేఖను దాటవద్దని ఈ నిర్ణయం ద్వారా నిరూపితమైందని మల్లు రవి తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
FD Maturity Rules: మెచ్యూర్ అయిన FDని విత్‌డ్రా చేయకపోతే ఏమవుతుంది..? RBI కొత్త రూల్స్ తెలుసుకోండి..
-
Ultraviolette X-47 Venom: అల్ట్రావయోలెట్ X-47 Venom లాంచ్.. 343KM రేంజ్, 77 GHz రియర్ రాడార్, 155 km/h టాప్ స్పీడ్
-
Kusal Mendis: 430 పరుగుల లక్ష్యం చూసి భయపడలేదు.. ఇంగ్లండ్‌పై మా విజయానికి కారణం అదొక్కటే!
-
Aliss Al Islam: బంగ్లాదేశ్ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం.. ఐసీసీకి రిపోర్ట్.!
-
WTC Points Table: ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా గెలుపు.. అప్డేట్ అయిన పాయింట్ల పట్టిక.. టాప్ 5 దేశాలివే..
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!