Konda Surekha : గతంలో పార్టీని తిట్టిన వారిపై చర్యలేవి.? కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
- నాపైనే ఎందుకు చర్యలు?
- గత నేతల వ్యాఖ్యలపై ప్రశ్నలు
- సీఎంను కలవడం కష్టమే
- కాంగ్రెస్కు సురేఖ కీలక సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై మాజీ మంత్రి కొండా సురేఖ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై బాధ లేదు కానీ, కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా, తన వివరణ కోరకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించి తనపై చర్యలు తీసుకోవడం బాధాకరమని, తన మాజీ ఓఎస్డీ సుమంత్పై నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో పార్టీని తిట్టిన వారిపై చర్యలేవి?
కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుపట్టిన కొండా సురేఖ, గతంలో పలువురు సీనియర్ నేతలు పార్టీని విమర్శించినా లేని చర్యలు తనపైనే ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. “గతంలో మల్లు రవి కూడా పార్టీని తిట్టారు, రోశయ్య సైతం ‘విధవ రాజ్యం ఏలుతోంది’ అని వ్యాఖ్యానించారు, టీపీసీసీ అధ్యక్ష పదవిని ₹50 కోట్లు పెట్టి కొన్నారని మాట్లాడిన వారిపై ఎలాంటి చర్యలు లేవు” అని గుర్తుచేశారు. నిన్నటికి నిన్న పార్టీకి నష్టం కలిగించేలా కొందరు మాట్లాడినా వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని, కానీ తన విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
సహాయం పొందినవారే నేడు విమర్శిస్తున్నారు
తమ నియోజకవర్గానికి వచ్చి తమ కాళ్లు మొక్కి, నియోజకవర్గం అంతా తిరిగిన వారే ఈరోజు తమపై విమర్శలు చేస్తున్నారని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ మాటను ఆయన భార్యే వినదు, కానీ ఆయన కూడా ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు” అని ఎద్దేవా చేశారు. పార్టీలోని ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు అయినా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించిన ఆమె, అందరూ తమ గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలని, బయటకు వచ్చి తమ సమస్యలను బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిచ్చారు.
సీఎంను కలవడానికి సమయం దొరకదు
ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించిన సురేఖ, ముఖ్యమంత్రిని కలవడానికి కనీసం సమయం కూడా దొరకడం లేదని ఆరోపించారు. సీఎం ప్రెజెంటేషన్లు లేదా పిటిషన్లు అసలు తీసుకోరని, తీసుకున్నా సంతకాలు చేయరని, ఒకవేళ సంతకం చేసినా ఆ పనులు కావని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని తాను అడగనని, అయితే నగర కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్న తరుణంలో సీఎం తన పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. “ఆయనకు ఆయనే సీఎంగా చెప్పుకోవడం తప్పు కాదా?” అని ప్రశ్నించిన ఆమె, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టెక్కాలంటే అందరినీ కలుపుకొనిపోవాలని, ఇష్టారాజ్యంగా మోనోపోలీగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. అలాగే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తాను పంపిన రహస్య లేఖను బయట ఎవరికీ ఇవ్వలేదని కొండా సురేఖ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..