EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్‌తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EPFO Amnesty Scheme: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అమ్నెస్టీ స్కీమ్ 2026ను తీసుకొచ్చింది. ఆదాయపు పన్ను చట్టం కింద గుర్తింపు పొందినప్పటికీ, EPF చట్టం కింద అధికారిక మినహాయింపు ఉత్తర్వు లేని PF ట్రస్టులకు తమ హోదాను క్రమబద్ధీకరించుకునేందుకు ఇది ఒకసారి మాత్రమే లభించే అవకాశం. ఈ పథకం 2026 జూన్ 29న నోటిఫై చేసిన EPF Scheme 2026లో భాగంగా అమల్లోకి వచ్చింది.
ఎవరికి ప్రయోజనం?
ఆదాయపు పన్ను చట్టం, 1961 కింద గుర్తింపు పొందిన PF ట్రస్టులు, కానీ EPF&MP Act, 1952లోని సెక్షన్ 17 లేదా Code on Social Security, 2020లోని సెక్షన్ 143 కింద అధికారిక మినహాయింపు ఉత్తర్వు పొందని సంస్థలు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. ఇది ఉద్యోగులకు నష్టాన్ని కలిగించకుండా PF ట్రస్టుల హోదాను క్రమబద్ధీకరించేందుకు తీసుకొచ్చిన ప్రత్యేక చర్య. అయితే, అర్హత కలిగిన సంస్థలను ప్రధానంగా రెండు వర్గాలుగా పరిగణిస్తున్నారు. మొదటి కేటగిరీలో ఇప్పటికే అన్ఎగ్జెంప్టెడ్ సంస్థలుగా నిబంధనలను పాటించడం ప్రారంభించిన లేదా ఇకపై అదే విధంగా కొనసాగించాలనుకునే సంస్థలు ఉన్నాయి. రెండో కేటగిరీలో కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ కింద ఎగ్జెంప్టెడ్ సంస్థలుగా కొనసాగాలనుకునే PF ట్రస్టులు ఉన్నాయి.
Also Read
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?
ఈ పథకం ద్వారా అర్హత కలిగిన PF ట్రస్టులకు గత తేదీ నుంచి మినహాయింపు హోదాను క్రమబద్ధీకరించే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఉన్న కనీస ఉద్యోగుల సంఖ్య, PF కార్పస్ పరిమాణం, మూడేళ్ల ముందస్తు కంప్లయెన్స్ వంటి కొన్ని నిబంధనల నుంచి మినహాయింపు లభిస్తుంది. సభ్యుల ఖాతాల్లో చట్టబద్ధమైన రేటుకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా కంట్రిబ్యూషన్లు, వడ్డీ జమ చేసి ఉంటే, బకాయిలు, డ్యామేజీలు, వడ్డీకి సంబంధించిన కొన్ని పెండింగ్ అసెస్మెంట్లు ఉపసంహరించబడి ముగిసే అవకాశం ఉంది. గతంలో ఖరారైన కొన్ని ఆదేశాలను కూడా రద్దైనవిగా పరిగణించే నిబంధనలు ఉన్నాయి.
డిసెంబర్ 28 వరకు అవకాశం
ఈ అమ్నెస్టీ పథకం ఆరు నెలల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2026 జూన్ 29న నోటిఫై చేయడంతో 2026 డిసెంబర్ 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల అర్హత ఉన్న PF ట్రస్టులు గడువు ముగిసేలోపు ప్రక్రియను పూర్తి చేయాలి. అయితే, అర్హత కలిగిన సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి ఉద్దేశించి అధికారిక దరఖాస్తును తమ సంబంధిత EPFO ప్రాంతీయ కార్యాలయం ద్వారా సమర్పించాలి. తమ ఆసక్తిని తెలియజేసే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ను rc.exemption@epfindia.gov.inకు కూడా పంపవచ్చు. ఆర్థిక ఖాతాలను చార్టర్డ్ అకౌంటెంట్‌తో ఆడిట్ చేయించాలి. EPFO అధికారులు సూచించే ప్రత్యేక లేదా కంప్లయెన్స్ ఆడిట్‌ను దరఖాస్తు చేసిన మూడు నెలల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యం
PF ట్రస్టుల నిబంధనల ఉల్లంఘనలు, మినహాయింపు హోదాకు సంబంధించిన సమస్యలను ఒక నిర్ణీత గడువులో పరిష్కరించడంతో పాటు ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటమే ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా EPFO పేర్కొంది. అర్హత ఉన్న PF ట్రస్టులు ఈ ఒక్కసారి లభిస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!