Komatireddy Venkat Reddy : 65వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించాలనేది నా కల
- NH 65ను 6 లైన్లుగా విస్తరించాలనేది నా కల
- వాహనాల రద్దీపై ప్రభుత్వానికి GMR తప్పుడు లెక్కలు చెప్పింది
- జాతీయ రహదారి విస్తరణ తర్వాత నల్గొండ జిల్లాలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తాం : మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy : నల్లగొండ జిల్లాలో నేడు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా 65వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలవుతాయన్నారు. 65 వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు లైన్ లుగా విస్తరించాలనేది నాకల అని ఆయన వ్యాఖ్యానించారు. విస్తరణ తర్వాత యాక్సిడెంట్ ఫ్రీ జాతీయ రహదారి అందుబాటులోకి వస్తుందని, మే నెలలో జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలై రెండు సంవత్సరాలలో పూర్తవుతాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వాహనాల రద్దీ విషయంలో GMR ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చెప్పిందన్నారు మంత్రి కోమటి రెడ్డి. GMR నేషనల్ హైవే అథారిటీతో చేసుకున్న అగ్రిమెంట్ ను ఉల్లంఘించిందన్నారు. నా పోరాటం వల్లే 65 వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ జరగబోతుందని, జాతీయ రహదారి విస్తరణ తర్వాత నల్లగొండ జిల్లాలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.
Mohan Lal : ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తున్న మోహన్ లాల్ బిగ్గెస్ట్ డిజాస్టర్
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
అంతేకాకుండా..’అర్వపల్లి జంక్షన్ లో ఫ్లైఓవర్ లేదు ప్రజలు ఆందోళనకు గురికావద్దు. ట్రిపుల్ ఆర్ పనులు మే నెలలో మొదలవుతాయి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయి.. హైదరాబాద్ రూపు రేఖలు మారిపోతాయి. త్రిబుల్ ఆర్ పూర్తి చేసేందుకు నేను, సీఎం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నాం. కేటీఆర్ ను ధర్నాలు దీక్షలు, పాదయాత్ర చేసినా ప్రజలు నమ్మరు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ. నల్గొండ జిల్లా కేంద్రంలో రైతు ధర్నా చేసే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. బీఆర్ఎస్ చేసిన మోసం వల్లే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 50 వేలకు పైగా మెజారిటీ, ఎంపీలు దేశంలోనే రికార్డు మెజారిటీతో గెలిచారు. 10 సంవత్సరాలు పాలించి.. వందేళ్లు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు. త్వరలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఆ తర్వాత రాష్ట్రంలో అన్ని పార్టీలు తెర మరగయిపోతాయి.’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Trump On TikTok: అలా చేస్తేనే అమెరికాలో టిక్‌టాక్ సేవలను తిరిగి ప్రారంభిస్తాం..
తాజావార్తలు
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!