KTR : పదవీకాలం ముగిసిన మున్సిపల్ ఛైర్మెన్, వైస్ చైర్మన్ లకు తెలంగాణ భవన్‌లో ఆత్మీయ సత్కారం చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన మున్సిపాలిటీలను అభివృద్ది చేసుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ హయంలో 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చామని,…
Komatireddy Venkat Reddy : నల్లగొండ జిల్లాలో నేడు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా 65వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలవుతాయన్నారు. 65 వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు లైన్ లుగా విస్తరించాలనేది నాకల అని ఆయన వ్యాఖ్యానించారు. విస్తరణ…
తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడంలో నల్గొండ జిల్లా ముందువరుసలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి నల్గొండవాసేనని సీఎం తెలిపారు. నల్గొండలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు నూతన మెడికల్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన గడ్డ ఇదంటూ ఆయన కీర్తించారు.
నల్లగొండ పట్టణాభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. రాష్ట్రంలోని అన్ని పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా అభివృద్ధి చెందాలని.. నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని.. ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని వెల్లడించారు.. నల్లగొండను అన్ని హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలని ఆదేశించిన కేసీఆర్.. అభివృద్ధికి ప్రభుత్వం సరిపడా నిధులు ఇస్తుందని.. ఇందుకు తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలని స్పష్టం చేశారు.. నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం, అణువణువూ…