Komatireddy Venkat Reddy : ఉద్యమ గళం మూగబోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజా గాయకుడు గద్దర్ ఈ రోజు కన్నుమూశారు. గద్దర్ చనిపోయినట్లు కొడుకు సూర్యం తెలిపారు. ఇవాళ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ తుదిశ్వాస విడిచారు. అయితే.. ప్రజా గాయకుడు గద్దర్ మృతిపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఉద్యమ గళం మూగబోయిందని, ప్రజా యుద్ధనౌక గద్దర్ గారు కన్నుమూశారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో నాకు మంచి అనుబంధం ఏర్పడిందని, నా పోరాటానికి ఆయనే స్ఫూర్తి అని ఆయన వెల్లడించారు. జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ ఒకరు అని, ప్రజా సమస్యలపై ఆయన పోరాటం అజరామరం అని అన్నారు. తనదైన పాటలతో ఎంతోమందిని ఉత్తేజ పరిచారు గద్దర్ అని, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర కీలకమని ఆయన కొనియాడారు. అనేక పాటలతో ఆనాడు ఉద్యమానికి ఊపు తెచ్చారని, తెలంగాణ ఉద్యమ గళం అయిన గద్దర్ స్మృతిలో.. ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
Also Read : CM Jagan: ప్రజా కవి గద్దర్ మరణంపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి
Also Read
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
అయితే.. గద్దర్ మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో దళిత కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లా మహబూబ్ నగర్ లో, ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వారు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.
Also Read : CM KCR : జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!