రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దును వ్యతిరేకిస్తూ ‘సంకల్ప్ సత్యాగ్రహ’ పేరుతో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ గాంధీభవన్‌లోనూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. అనర్హత వేటు ఎత్తివేసే వరకు పోరాటం ఆగదని నేతలు స్పష్టం చేశారు. అవసరమైతే ఎంపీలు అందరూ రాజీనామా చేస్తామన్నారు. అయితే ఈ సందర్భంగా గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన దీక్షలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. జానారెడ్డిని కురువృద్ధుడు అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంభోదించారు. దీంతో.. కురువృద్ధుడు ఏంటనీ రేవంత్ ప్రశ్నించగా.. నా రాజకీయా గురువే జానారెడ్డే అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమాధానం ఇచ్చారు.
Also Read : MLA Rapaka Varaprasad: టీడీపీ నాకు రూ.10 కోట్లు ఆఫర్ చేసింది.. ఎమ్మెల్యే రాపాక బాంబ్
అంతేకాకుండా.. నీ కంటే ముందే నాకు గురువు అని రేవంత్ ని కోమటిరెడ్డి అనడంతో.. సరదా సంభాషణతో దీక్ష వేదికపై నేతల నవ్వులు పూయించారు. ఇదిలా ఉంటే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్షలో ప్రసంగిస్తూ.. రాహుల్ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు. అదానీ అంశాన్ని దారిమళ్లించేందుకే రాహుల్‌పై అనర్హత వేటు వేశారని ఆయన మండిపడ్డారు. అవసరమైతే ఎంపీలంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన పరిస్థితి కంటతడి పెట్టేలా ఉందని, ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చినా రాహుల్ వదులుకున్నారన్నారన్నారు. అదానీ గురించి రాహుల్ ఎప్పుడు మాట్లాడారో.. అప్పటి నుంచి కుట్ర చేశారని, ఆగమేఘాల మీద పరువు నష్టం కేసులో శిక్ష పడేలా చేశారని ఆయన మండిపడ్డారు. రాహుల్ పై అనర్హత వేటు ఎత్తేసే వరకు పోరాటం ఉధృతం చేయాలని, ఇందిరా గాంధీపై వేటు వేస్తే ఏం జరిగిందో..ఇప్పుడు అదే జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Man Sentenced: అనుకోకుండా చిన్నారి హత్య.. దోషికి 100 ఏళ్ల జైలు శిక్ష