Kodali Nani: వెయ్యి మంది బాలయ్యలు, చంద్రబాబులు వచ్చినా.. జూ.ఎన్టీఆర్‌ని ఏమీ చేయలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: వెయ్యి మంది బాలయ్యలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి.. అయితే, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.. ఇదే నందమూరి ఫ్యామిలీలో ఉన్న వివాదాలకు ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. ఈ రోజు ఉదయమే జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించగా.. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు.. అయితే, అక్కడ ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసేయ్.. ఇప్పుడే అంటూ బాలయ్య ఆదేశాలు ఇచ్చినట్టు ఉన్న ఓ వీడియో వైరల్‌గా మారింది.. ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడం చర్చగా మారింది. దీనిపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు కొడాల నాని.. బాలయ్య లాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Ram Mandir: రామ మందిరానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రచారం..
Also Read
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన కొడాలి నాని.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మానసిక వేదనతో చనిపోయారు. ఎన్టీఆర్ పనికి రాడన్న గజ దొంగ చంద్రబాబు అని.. ఆ చంద్రబాబే ఇప్పుడు ఎన్టీఆర్ బూట్లు నాకుతున్నారని దుయ్యబట్టారు. చంపిన వ్యక్తులే ఎన్టీఆర్‌ను పొగుడుతూ.. కీర్తిస్తున్నారు. టీడీపీ నేతలు ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు రా కదిలి రా అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతుందని సెటైర్లు వేశారు. అల్లుడి నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో పెద్ద ఎన్టీఆర్‌ను దించిన బాలయ్య.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని ఎద్దేవా చేశారు.. అంతే కాదు.. వెయ్యి మంది బాలకృష్ణలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా.. జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయిన వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.
తాజావార్తలు
-
Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు.. ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?
-
Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
-
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
-
YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్‌లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!