CPI Narayana: సీపీఐ నారాయణ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. యువతకు పెద్ద పీట వేసేలా బీఆర్ఎస్, బీజపీ మ్యానిఫెస్టోలు లేవని అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. యువతను బీజేపీ దగా చేస్తుందని, ఇన్ని ఏళ్లలో కనీసం కేసీఆర్ ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహించలేకపోయిందని విమర్శించారు. దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశాడని, ఇప్పుడు బీసీని సీఎం చేస్తానని బీజేపీ చెబుతోందని అన్నారు. బీసీని సీఎం చేస్తానని చెబుతున్న బీజేపీ, బీసీ అధ్యక్షుడిని తొలగించిందని కామెంట్స్ చేశారు.
ఎప్పుడైతే కమితను లిక్కర్ స్కాం నుంచి తప్పించారో అప్పుడే బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అని బయటపడిందని అన్నారు. గోబెల్స్ బతికి ఉంటే కేసీఆర్, మోడీ మాటలు విని చచ్చిపోయే వాడని చెప్పారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో బీజేపీ మ్యానిఫెస్టో అలా ఉందని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ఓట్ల కోసం నానా గడ్డి కరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి కాకకపోతే ఎంఐఎం గోషామహల్ లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు.
Read Also: Mangaluru: మంగళూరు ఎయిర్ పోర్ట్ రూ.70.02 లక్షల విలువైన బంగారం స్వాధీనం..
ఉణ్న పార్టీ సీట్ ఇవ్వకుంటే బీఫామ్ కొనుక్కని ఓ దౌర్భాగ్యుడు కొత్తగూడెంలో ఫార్వర్డ్ పార్టీ నుంచి పోటీలో ఉన్నాడని, బీఫామ్ కొనుక్కుని పోటీ చేసి ప్రజలకు ఏం సేవ చేస్తారని నారాయణ ప్రశ్నించారు. జలగం వెంగళరావు వారసుడు వెంకట్ రావుకి బీ ఫామ్ కొనుక్కునే దుస్థితి పట్టిందని అన్నారు. ఎప్పటికైనా బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని, తెలంగాణ ప్రజలు ఆలోచించాలని, ఒకే దెబ్బకు మూడు పిట్టలు కతం అవుతాయని అన్నారు.