UP T20 League 2024: ఛాంపియన్‌గా నిలిచిన రింకు సింగ్ జట్టు..
- ఐదు వికెట్ల తేడాతో ఓడించి UP T20 లీగ్ 2024 టైటిల్‌ను గెలుచుకున్న మీరట్ మావెరిక్స్.
- రింకూ సింగ్ ఫైనల్ మ్యాచ్‌లో లేనప్పటికీ అతని జట్టు ఛాంపియన్‌గా ఘనత సాధించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP T20 League 2024: మీరట్ మావెరిక్స్ జట్టు కాన్పూర్ సూపర్ స్టార్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి UP T20 లీగ్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. మీరట్ జట్టు తొలిసారి ఈ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. దీనికి టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఫైనల్ మ్యాచ్‌లో అతను జట్టుకు నాయకత్వం వహించనప్పటికీ.. అతని జట్టు ఛాంపియన్‌గా ఘనత సాధించింది. దులీప్ ట్రోఫీలో పాల్గొనడం వల్ల రింకు సింగ్ ఫైనల్ మ్యాచ్ ఆడలేకపోయాడు, దీని కారణంగా మాధవ్ కౌశిక్‌కి మీరట్ మావెరిక్స్ కెప్టెన్సీని అప్పగించారు. మీరట్ గత సీజన్ అంటే 2023 ఫైనల్‌లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. కానీ., ఈసారి జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. గత సీజన్‌లో కాశీ రుద్రరాజ్ మీరట్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి UP T20 లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది.
Sub-Registrar Office: సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు స్వస్తి..
Also Read
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
మీరట్ మావెరిక్స్ ఈ టైటిల్ విజయంలో కెప్టెన్ మాధవ్ కౌశిక్, 19 ఏళ్ల బ్యాట్స్‌మెన్ స్వస్తిక్ చికారా ముఖ్యమైన సహకారాన్ని అందించారు. కౌశిక్ సిక్సర్ కొట్టి తన జట్టును గెలిపించాడు. మాధవ్ 43 బంతుల్లో (రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) అజేయంగా 69 పరుగులు చేయగా, స్వస్తిక్ చికారా 31 బంతుల్లో 62 పరుగులు (మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు)తో రాణించారు. ఐపీఎల్‌లో స్వస్తిక్ చికారా ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగంగా ఉన్నాడు. లక్నో ఎకానా స్టేడియంలో జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన కాన్పూర్ సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. కాన్పూర్ తరఫున కెప్టెన్ సమీర్ రిజ్వీ 36 బంతుల్లో 57 అత్యధిక పరుగులు చేశాడు. అతను కాకుండా, శౌర్య సింగ్ 23 బంతుల్లో 56 పరుగులు చేశాడు. మీరట్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన యశ్ గార్గ్ 3 వికెట్లు పడగొట్టాడు.
Balapur Laddu: బాలాపూర్ గణేష్ లడ్డు కొన్నాక దశ తిరిగింది.. ఈసారి కూడా రికార్డు సృష్టిస్తా..!
191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన మీరట్ మావెరిక్స్‌కు ఆరంభం సరిగా లేదు. ఆకాష్ దూబే కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత జట్టు కేవలం 40 పరుగులకే ఉవైష్ అహ్మద్ (13) వికెట్ కూడా కోల్పోయింది. అయితే దీని తర్వాత స్వస్తిక్ చికారా, మాధవ్ కౌశిక్ 66 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు.
The moment of 𝒗𝒊𝒄𝒕𝒐𝒓𝒚!@UPCACricket | @Meerutmavericks
This was #MahaSangramKaMahaMuqabla! #CricketKaMahaSangram #UPT20 #UPT20League #Cricket #UttarPradeshCricket #MeerutMavericksVSKanpurSuperstars pic.twitter.com/Wf05yw88v3
— UP T20 League (@t20uttarpradesh) September 14, 2024
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?